Student Stabs Teacher to Death in Assam : అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి, విజ్ఞానమనే వెలుగును నింపేవారే టీచర్. అలాంటి టీచర్‌కు పురాణాలు సైతం పెద్దపీట వేశాయి. పిల్లలు తప్పు చేస్తే ఓ అమ్మలాగా, నాన్నలాగా దండించే హక్కు టీచర్‌కు ఉంది. విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ భావిభారత పౌరులుగా తయారు చేస్తారు. వారి భవిష్యత్తు బాగుపడాలని నిరంతరం శ్రమిస్తారు. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే మందలిస్తారు. అలా చేసినందుకు ఓ టీచర్‌ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది
AP Teacher Murder in Assam :విద్యాబుద్ధులు నేర్పిన గురువును తరగతి గదిలోనే విద్యార్థి కడతేర్చిన సంఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనలో ప్రకాశం జిల్లాకు చెందిన రాజేశ్‌బాబు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు నగరం అన్నవరప్పాడుకు చెందిన బెజవాడ రాజేశ్‌బాబు రసాయన శాస్త్రం (Chemistry) అధ్యాపకుడు. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో దాదాపు పదేళ్ల పాటు రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పని చేశారు. అనంతరం స్నేహితులతో కలిసి అస్సాంలోని శివసాగర్ ప్రాంతంలో సొంతంగా కళాశాల నెలకొల్పారు. పదమూడేళ్లుగా రాజేశ్‌బాబు ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య అపర్ణ ఆ కళాశాలల్లోనే డైరెక్టర్‌గా ఉన్నారు. కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థికి గణితంలో మార్కులు తక్కువగా రావడంతో పాటు అతడి ప్రవర్తన సైతం సరిగా లేకపోవడంతో గణిత అధ్యాపకుడు శనివారం మందలించారు. అతడు ఇంటికెళ్లి పెద్దలను తీసుకురావాలని ఆదేశించారు.
బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ.50 వేల బహుమతి