Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs :పట్టుదలతో చదివి లక్ష్యసాధనకు కృషి చేస్తే సాధించ లేనిది ఏదీ లేదని నిరూపించింది ఈ విద్యార్థిని. ఆర్థిక మాంధ్యంతో ఉద్యోగం సంపాదించడమే గగనం అయిపోతున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలో కొలువు సాధించింది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుల్ల గ్రామానికి చెందిన విద్యార్థిని నిర్మల ప్రియ ఈ సంవత్సరం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రాజాంలో జీఎంఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల (GMRIT Engineering College)లో బీటెక్‌లో ఐటీ పూర్తి చేసింది.
9.51 సీజీపీఏ సాధించారు. ఎనిమిదో సెమిస్టర్లో భాగంగా ఈమెతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ప్యారిస్‌లోని గ్రూప్ ఏడీపీలో ఇంటర్న్‌షిప్ చేయడానికి ఎంపికయ్యారు. ఒక్కొ విద్యార్థి 1000 యూరోల (90,000 రూపాయలు) స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. ప్యారిస్‌లోని గ్రూప్ ఏడీపీలో ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని నిర్మల ప్రియ కొలువు సాధించింది.
Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs : (ETV Bharat) పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA
40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం : నిర్మల ప్రియకు ఏకంగా 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా. సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ గురువారం తెలిపారు. విద్యార్థిని నిర్మల ప్రియ బీటెక్ కోర్స్‌లో భాగంగా ఉన్న కెరీర్ సౌత్ కోర్సుల్లో ఒకటైన సైబర్ సెక్యూరిటీని పూర్తి చేయడం ద్వారా ఈ ఉద్యోగం వరించిందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆయనతో పాటు జీఎంఆర్‌వీఎఫ్ విద్యా విభాగం సంచాలకుడు డా. జె. గిరీష్ విద్యార్థినిని అభినందించారు. విద్యార్థిని నిర్మల ప్రియ తండ్రి వెంకటరావు కేటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు
సైబర్ సెక్యూరిటీపై పట్టు : ప్యారిస్‌లోని గ్రూప్ ఏడీపీలో కొలువు సాధించిన సందర్భంగా విద్యార్థిని నిర్మల ప్రియ బీటెక్ కోర్సుల్లో భాగంగా ఉన్న కెరీర్ పాత్ కోర్సుల్లో ఒకటైన సైబర్ సెక్యూరిటీని పూర్తి చేయడం ద్వారా ఈ ఉద్యోగం వరించిందని అన్నారు. ప్రపంచ అవసరాలకు తగిన రీతిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మంచి వార్షిక వేతనంతో ఎంపికవడం సంతోషాన్ని ఇస్తోందని విద్యార్థిని అన్నారు.
వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన - యువతకు ఆదర్శం