SSC Board Releases Schedule for 10th Class Exams in Telangana : పరీక్షల కాలం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించగా తాజాగా తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనుంది.
Tenth Class Exams Schedule in AP :ఇంటర్,పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఎక్స్ వేదికగా విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు ( AP SSC Exam Schedule) జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ లోకేశ్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
మార్చి 1 నుంచి ఇంటర్ - 17 నుంచి పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్ విడుదల