Srikakulam Youth Shines in Softball : అచ్చం క్రికెట్‌ను పోలి ఉండే సాఫ్ట్‌బాల్ క్రీడాను ఆడడానికి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా లేకుండా సాధన చేస్తున్నారు. పట్టుదలతో క్రీడలో నైపుణ్యాలు మెరుగు పరుచుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు శ్రీకాకుళంకు చెందిన క్రీడాకారులు. సాఫ్ట్‌బాల్ క్రీడను 2028 సమ్మర్ ఒలింపిక్స్‌లో చేర్చడంతో యువతకు ఈ క్రీడపై ఆసక్తి పెరిగింది.
సాఫ్ట్‌బాల్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడంతో ఆసక్తి :అచ్చం క్రికెట్‌లా ఉండడంతో తెలుగురాష్ట్రాల యువత సైతం మక్కువ కనబరుస్తున్నారు. ఐతే ఈ టీమ్‌లో 9 లేదా 10 మంది క్రీడాకారులు ఉంటారు. చూసిన వెంటనే అర్థం కాకపోయినా రూల్స్ తెలుసుకుంటే ఆసక్తిగా ఆనందించవచ్చు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఆటను చేర్చుకపోవడంతో ఎంతోమంది క్రీడాకారులు నిరాశ కు గురయ్యారు. అయితే రాబోయే ఒలింపిక్స్ చేర్చడంతో యువత ఇప్పంటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి మరింత ఉత్సాహంగా లక్ష్య సాధన దిశగా యువ క్రీడాకారులు సాధన చేస్తున్నారు.
13ఏళ్లలో 19వేలకుపైగా పాములు- వాటి కోసమే ఆ యువకుడి పోరాటం - Kranthi of Jangareddygudem
No Proper Training & Facilities :క్రీడలో రాణించాలనే పట్టుదల ఉన్నా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో క్రీడాకారులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద క్రీడాకారులు ఆటకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయాలంటే భారమవుతోంది. మైదానాల విషయంలోనూ ప్రభుత్వం సహాకారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్య సాధన కోసం సొంత ఖర్చులతో ఇతర రాష్ట్రాల్లో జరిగే పోటీలకు వెళ్లి మరి పతకాలు సాధించుకొస్తున్నారు ఈ యువ క్రీడాకారులు. ప్రభుత్వం సహాకరించి తగిన ప్రోత్సాహం అందిస్తే వీరిని క్రీడా రత్నాలుగా తీర్చిదిద్దుతామని కోచ్‌లు అంటున్నారు
కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదిక - ఇంజినీరింగ్ కాలేజీల్లో స్పేస్ డే వేడుకలు - National Space Day Celebrations
విజయం సాధించడమే లక్ష్యంగా :ఒకవైపు చదువు సాగిస్తూనే మరోవైపు ఆటలపై దృష్టి సాగిస్తున్నారు శ్రీకాకుళంకు చెందిన యువక్రీడాకారులు. సరైన ప్రోత్సాహం, సదుపాయాలు లేకున్నా ఆర్థికంగా ఇబ్బందులున్నా సాధించాలనే పట్టుదల, ఆత్మ విశ్వాసంతో సాధన చేస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయంగా సత్తా చాటాలనేది వీరి ఆకాంక్ష అని చెబుతున్నారు.
పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA