ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయల కాలం నాటి పొడికూర - అప్పట్లో సైనికుల బలానికీ ఇదే కారణమట! - SRI KRISHNADEVARAYA EMPIRE FOOD

అప్పటి కాలం రుచులు పరిచయం చేస్తున్నా అన్నాచెల్లెలు

SRI_KRISHNADEVARAYA_EMPIRE_FOOD
SRI_KRISHNADEVARAYA_EMPIRE_FOOD (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 8:25 AM IST

Sri Krishnadevaraya Empire Food At Tirupati : అనగనగా ఓ గొప్ప రాజు. ఆయన పేరే శ్రీకృష్ణ దేవరాయలు. రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఆయన సైన్యం నెలల తరబడి యుద్ధం చేసేవారని ఎన్నో కథల్లో విన్నాం. మరీ ఆ సమయంలో సైన్యం ఏం తిన్నారనేది ఎక్కడా కూడా విని ఉండం, చదివి ఉండం కదా! అలనాటి రాయలవారి వంటను తిరుపతికి చెందిన అన్నాచెల్లెలు బండారు దీపక్, బండారు సాయి శ్రావణి మనకు పరిచయం చేస్తున్నారు. ఆ వంటల ప్రత్యేకత, అసలు వీళ్లు అటు వైపు ఎందుకు మళ్లారో తెలుసుకుందాం!

వారసత్వంగా ఎలా వచ్చిందంటే : శ్రీకృష్ణ దేవరాయల సైన్యం నెలల తరబడి బయట జీవించేందుకు వారి వెంట దుప్పులు, మేకలు, కోళ్లతో తయారు చేసిన ‘పొడికూర’ అనే పదార్థాన్ని తీసుకెళ్లేవారు. అది రుచిగా, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా రాయల వంటశాలలో ప్రత్యేకంగా తయారు చేయించేవారు. అలా తిన్న పాలెగాళ్లలో ఒకరు ఆ రుచికి కారణం ఏమిటో తెలుసుకొని, అలా తన ఇంట్లో కూడా ఆ పొడికూర పరిచయం చేశారు. ఇక అంతే అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులు అదే రుచికి అలవాటు పడిపోయారు. వాటితో పాటు ఆ కాలం నాటి నిల్వ పచ్చళ్లు కూడా వారు నేటికీ తయారు చేస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన సంధ్య అనే పెద్దావిడ వాటిని బతికిస్తే, ఇప్పుడు ఆమె కుమారుడు, కుమార్తె కలిసి నేటి తరానికి వీటిని పరిచయం చేస్తున్నారు.

బర్మా నుంచి వచ్చిన పిచ్చుకగూళ్లు - చూస్తేనే నోరు తెరుచుకుంటుంది!

సీమలో ఇది కూడా ప్రసిద్ధే :నాటు కోడి ఛాతి భాగం తీసుకొని గంటసేపు ఉడికిస్తారు. ఎముకలన్నీ తీసి నూనె లేకుండా వేయిస్తారు. మేక మాంసంతో కూడా ఇలానే పొడికూర చేస్తారు. 6 నెలల పాటు నిల్వ ఉంటే ఈ పదార్థానికి అమెరికా, మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో అభిమానులు చాలా మందే ఉన్నారు. రాయలసీమ అంటే రాగి సంగటి మాత్రమే కాదని రాయల కాలంలో పొడికూర ప్రసిద్ధి అని ఈ అన్నాచెల్లెలు తెలియజేస్తున్నారు. రాయల కాలం నాటి మాంసాహారపు పచ్చళ్లు కూడా మన అందరికీ పరిచయం చేస్తున్నారు.

మొక్కజొన్నతో​ అద్దిరిపోయే క్రరీ! - ఇలా చేస్తే చపాతీ, అన్నంలోకి అద్భుతమే!!

ఉద్యోగానికి స్వస్తి పలికి మరీ : సంధ్య కుమారుడు బండారు దీపక్‌ బీటెక్‌ చేసి కొన్నాళ్లు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేశారు. తండ్రి మరణించడంతో తిరుపతికి వచ్చిన దీపక్‌కు వంటల తయారీపై మక్కువతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగానికి స్వస్తి పలికారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న పొడికూర వంట గురించి వాళ్ల అమ్మను అడిగి తెలుసుకున్నారు. బీకాం చేసిన చెల్లెలు సాయి శ్రావణితో కలిసి రాయల కాలం నాటి పొడికూరను ఇప్పటి తరానికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇంటి నుంచి రాయల కాలం నాటి వంటల రుచులను అందిరికి అందించడం మొదలుపెట్టారు.

మీ ఇంట్లో కొబ్బరి మిగిలిపోయిందా? - ఇలా "కాలా జామూన్" చేసుకోండి- నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details