ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - ఆ రైళ్లలో జనరల్​ బోగీల సంఖ్య పెంపు! - ADDITIONAL COACHES IN 9 TRAINS

సాధారణ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ నిర్ణయం - జనరల్​ బోగీల సంఖ్య రెండు నుంచి నాలుగుకు పెంపు

additional_general_coaches_in_9_trains
additional_general_coaches_in_9_trains (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 1:07 PM IST

South Central Railway Says Increase Additional General Coaches in 9 Trains : రైళ్లలో సామాన్య ప్రయాణికుల ఇబ్బందుల్ని తగ్గించేందుకు జనరల్‌ బోగీల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచామని, త్వరలో మరో 9 రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను పెంచుతామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

హైదరాబాద్‌ నుంచి ముంబయి అక్కడ నుంచి హైదరాబాద్‌ (22731/22732), హైదరాబాద్‌-ముంబయి-హైదరాబాద్‌ (12702/12701), తిరుపతి-హజ్రత్‌ నిజాముద్దీన్‌-తిరుపతి (12707/12708), నాందేడ్‌-అమృత్‌సర్‌-నాందేడ్‌ (12715/12716), హైదరాబాద్‌-జైపుర్‌-హైదరాబాద్‌ (12720/12719), హైదరాబాద్‌-విశాఖపట్నం-హైదరాబాద్‌ (12728/12727), హైదరాబాద్‌-తాంబరం-హైదరాబాద్‌ (12760/12759), తిరుపతి-హజ్రత్‌ నిజాముద్దీన్‌-తిరుపతి (12793/12794), సికింద్రాబాద్‌-హిస్సార్‌-సికింద్రాబాద్‌(22737/22738). ఈ రైళ్లలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు.

అటెన్షన్​ ఆల్​ - పలు రైళ్ల టైమింగ్​లో మార్పులు

నేటి నుంచి రైల్వేలో కొత్త టైం టేబుల్‌ :దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని రైళ్ల ప్రయాణ వేళల్లో రైల్వేబోర్డు మార్పులు చేర్పులు చేసింది. కొత్త టైం టేబుల్‌ బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని, వివరాలు నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ (ఎన్‌టీఈఎస్‌) వెబ్‌సైట్‌లో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

2024లో 1,385 మంది పిల్లలను రక్షించినట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి రూ.5.03 కోట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటుకు ముందడుగు- టెండర్లును పిలిచిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details