Software Employees are Also Labourers in Anantapur District :అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి పంచాయతీకి చెందిన ఒకరు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో 050145 జాబ్ కార్డుతో ఉపాధి పనులు హామీ కింద పనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి రూ.వేలల్లో డ్రా చేశారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నారు.
50193 జాబ్‌కార్డుతో ఉపాధి పనులు చేసినట్లు చూపించి రూ.వేలల్లో సొమ్ము చేసుకున్నారు. మరొకరు బెంగళూరులోనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. 050185 జాబ్‌కార్డు మీద గ్రామంలో ఉపాధి పనులకు హాజరైనట్లు చూపించి రూ.వేలల్లో బిల్లులు కాజేశారు. గ్రామంలో లేని వారి పేరుతో మస్టర్లు సృష్టించి సొమ్ము చేసుకున్నారు.
Illegal Looted YSRCP Leaders: ఉపాధి హామీ పథకం (MGNREGA)పెద్దలకు కాసులు కురిపిస్తోంది. పేదలు రెక్కలుముక్కలు చేసుకుని కూలీ పొందుతున్నారు. కొందరు పెద్దలు మాత్రం ఇళ్లల్లో కూర్చుని అంతకంటే ఎక్కువ కూలీని పొందుతున్నారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి పంచాయతీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పేరుతో మస్టర్లు రూపొందించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.
బెంగళూరులో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గ్రామంలో ఉపాధి పనులకు హాజరైనట్లు రికార్డులు సృష్టించారు. వారి పేరుతో ఉపాధి పనులు మంజూరు చేశారు. ఒక్కొక్కరి పేరుతో 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు బిల్లులు డ్రా చేశారు. చెర్లోపల్లిలో ఐదేళ్లలో ఉపాధి హామీ పథకం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్ల (Field Assistants) కనుసన్నల్లోనే అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉపాధి హామీ పథకానికి జగన్ సమాధి - వేతనాలు నిలిచి కూలీల అవస్థలు - Rural Employment Guarantee Scheme