Social Teacher Suresh Story in Teachers Day Special : పాఠ్య పుస్తకాల్లో ఉన్నది వల్లె వేసి పిల్లలతో బట్టీ పట్టించే రకం కాదాయన. చెప్పేది ఏదైనా సూటిగా ఉంటుంది. విద్యార్థులకు పదికాలాల పాటు గుర్తుండిపోతుంది. పాఠాలు చెప్పడంలోని ఆ నైపుణ్యమే ఆయన్ని అత్యున్నతంగా నిలిపింది. సృజనాత్మకతకు సాంకేతికతను జోడించి సాంఘిక శాస్త్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆ మాస్టారు పాఠశాల విద్యలో చేసిన విశేష సేవలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రెండుసార్లు పురస్కారం దక్కించుకున్నారు. ఆయనే తిరుపతి జిల్లా ఉపాధ్యాయుడు సురేష్. టీచర్స్ డే వేళ ఆ ఆదర్శ మాస్టార్ గురించి తెలుసుకుందాం.
శ్రీకాళహస్తికి చెందిన సురేష్‌కు సోషల్ సబ్జెక్ట్‌పై ఉన్న ఆసక్తి 2001లో డీఎస్సీలో ఎంపికై టీచర్ ఉద్యోగాన్ని సాధించేలా చేసింది. వివిధ పాఠశాలల్లో పనిచేసిన సురేష్ పిల్లలకు పాఠ్యాంశాలను మరింత చేరువ చేసేలా సాంకేతికతను అందిపుచుకున్నారు. 2007 నుంచి డిజిటల్ బోధనపై దృష్టి పెట్టారు. సొంత ఖర్చులతో సాంఘిక శాస్త్ర పాఠాలను ఆడియో, వీడియోల రూపంలో సిద్ధం చేశారు. వాటిని ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో పెట్టారు.
ఆదర్శ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం - పాఠశాలలో విగ్రహం ఏర్పాటు - Teacher Statue Set Up in School
తెలుగు రాష్ట్రాల విద్యా శాఖ వీటిని వినియోగిస్తుంది. విక్టోరియల్ సోషల్ స్టడీస్ పేరుతో 1000 చిత్రాలు, మ్యాపులతో పుస్తకం రూపొందించారు. సోషల్ మెటీరియల్ సిద్ధం చేసి వంద శాతం ఉత్తీర్ణతలో కీలకపాత్ర పోషించారు. పాఠశాల రాజ్యాంగాన్ని రూపొందించి అమలు చేశారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు పాఠశాలలో పని చేస్తున్న సురేష్ ఉత్తమ సేవలను కేంద్రం గుర్తించింది. గతంలో ఓసారి, ఈ ఏడాది మరోసారి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేసింది.
పాఠ్యపుస్తకాల రూపాకల్పనతో పాటు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సురేష్ తెలుగులోకి అనువదించారు. అంధులకు ఆడియో పాఠాలు ఉచితంగా అందించారు. ఏపీ విభజన తర్వాత నూతన రాజకీయ, భౌతిక పటాలను సిద్ధం చేశారు. కరోనా వేళ వేల మందికి ఆన్‌లైన్‌లో ఉచితంగా పాఠాలు బోధించారు. సోషల్ టీచర్లకు అవసరమైన డిజిటల్ కంటెంట్ రూపొందించి ఉచితంగా అందించారు. గురుదేవా డాట్ కామ్ పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించారు. 23 లక్షల మంది వెబ్‌సైట్ వినియోగించుకొంటూ విద్యను అభ్యసిస్తున్నారు.
ఆ టీచర్ పెళ్లికి వెళ్లాలంటే పరీక్షే !- సమాధానాలు మీకు తెలిసినవే ! - TEACHER WEDDING INVITATION
ఎన్నికల వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా "భారత ఎన్నికల వ్యవస్థ" అనే పాఠ్యాంశాన్ని సురేష్ మాస్టారు రూపొందించారు. 2018 నుంచి ఈ పాఠం అందుబాటులోకి వచ్చింది. చరిత్రపై పోటీ పరీక్షల విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలను రూపొందిస్తున్నారు. సురేష్ మాస్టారు వినూత్న బోధనతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. బడిమానేసిన పిల్లలను తిరిగి చేర్పించడానికి తల్లిదండ్రులను కలిసి వారిని సురేష్ చైతన్య పరిచారు.
బడికి వస్తా, స్కూల్ మేళా, డోర్ టు డోర్ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వారి దీక్ష వెబ్‌సైట్‌లో కంటెంట్ క్రియేటర్, కంటెంట్ రివ్యూయర్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయి పురస్కారాలతో పాటు ఆంధ్రరత్నం, గ్లోబల్ బెస్ట్ టీచర్, అంబేడ్కర్ ప్రతిభా పురస్కార్, గురుమిత్ర వంటి అవార్డులు సురేష్ సొంతం చేసుకొన్నారు. సోషల్ సబ్జెక్ట్‌కు వన్నె తీసుకొస్తూ సురేష్ మాస్టారు చేస్తున్న అసమాన సేవలు స్ఫూర్తిదాయకం. ఇలాంటి టీచర్లే నవ భారత నిర్మాణానికి మూలస్తంభాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
బదిలీపై టీచర్ వేరే స్కూల్‌కు- మాస్టారు వెంటే మేమంటూ 133 మంది విద్యార్థులు టీసీలు తీసుకున్న వైనం - STUDENTS TRANSFERRED WITH TEACHER