Fire Accident In Eluru District:ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండలం భైరవపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రధాన కూడలిలో జాతీయ రహదారి పక్కన ఉండే పక్షుల వేటగాళ్లకు చెందిన 20 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ఓ మహిళతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దోమల నివారణకు అగరబత్తి వెలిగించగా నాటు తుపాకీలో ఉండే మందు గుండు సామగ్రికి అంటుకుని మంటలు చెలరేగాయి. గుడిసెల్లోని గ్యాస్ సిలిండర్లకు మంటలు వ్యాపించి భారీ పేలుడు సంభవించింది. నెల్లూరుకు చెందిన పక్షుల వేటగాళ్లు సుమారు 20 ఏళ్ల కిందట భైరవపట్నం వచ్చి స్థిరపడ్డారు.
అసలేం జరిగిందంటే? నెల్లూరుకు చెందిన పక్షుల వేటగాళ్లు ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండలం భైరవపట్నానికి 20 ఏళ్ల కిందట వచ్చి స్థిరపడ్డారు. ఆక్వా చేపలు రొయ్యల చెరువులపై పక్షులను వేటాడుతూ వేటగాళ్లు జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి 9.45 సమయంలో లోపలికి దోమలు రాకుండా ఉండేందుకు వీరు అగరుబత్తిని వెలిగించారు. వీరికి గల 20 గుడిసెల్లో ప్రతి ఇంట్లో నాటుతుపాకిలో పేలుడుకు ఉపయోగించే మందుగుండు సామగ్రి ఉండటం గమనార్హం. మందుగుండు సామగ్రి ఉండడంతో ఈ మంటలు వాటికి వ్యాపించాయి. దాంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలతో పక్కనే ఉన్న 20 గుడిసెలకు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి.
మాదాపూర్లోని బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం - భారీ ఆస్తినష్టం