Shrimati Amaravati Competitions in Vijayawada:మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు 'శ్రీమతి అమరావతి' పేరిట విజయవాడలో పోటీలు నిర్వహించారు. తేజస్ ఆలైట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'శ్రీమతి అమరావతి' సీజన్-9కి విశేష స్పందన లభించింది. ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తులు, విభిన్న వస్త్రధారణతో మహిళలు చేసిన ర్యాంప్ వాక్ చూపరులను కట్టిపడేశారు.
దాదాపు 30 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. మహిళల కట్టు, బొట్టు, అలంకరణ, సమయస్పూర్తి, జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులపై న్యాయనిర్ణేతలు ప్రశ్నలు సంధించారు. వ్యక్తిగత పోటీలు సైతం నిర్వహించారు. డిసెంబర్ 14న జరిగే 'శ్రీమతి అమరావతి' తుది పోటీలకు ఇప్పుడు పాల్గొన్న ఆ 30 మందిని ఎంపిక చేస్తున్నట్ల నిర్వహకులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని మహిళలు ఆభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.