TDP Suspend MLA Koneti Adimulam :తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే తనపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించి తనను వేధించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులను పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో మెసేజ్‌లు పంపి వేధించారని బాధితురాలు లేఖలో వెల్లడించారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు - కేసు నమోదు - MLA Adimulam Suspended From TDP - MLA ADIMULAM SUSPENDED FROM TDP
MLA Adimulam Suspended From TDP : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగిక వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
MLA Adimulam Suspended From TDP (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 5, 2024, 2:34 PM IST
ఈ విషయాన్ని టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. బలాత్కారం, బెదిరించి అత్యాచారం చేశారని కేసు ఫైల్ చేశారు.