Retired IAS EAS Sarma Letter On Buddha Land Issues: విశాఖలో చారిత్రాత్మక పురావస్తు స్థలాలు స్థిరాస్తి వ్యాపారులు కబ్జా చేస్తున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆవేదన చెందారు. విశాఖలో భీమునిపట్నం రెవెన్యూ పరిధిలో జరుగుతున్న అంశాల మీద పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్‌కు లేఖ రాశారు. భీమునిపట్నం కాపులుప్పాడ గ్రామంలో సర్వే నెంబరు 314లో 3 వేల ఎకరాలు నోటిఫై అయిన బౌద్ధ స్థలాలున్నాయిని లేఖలో పేర్కొన్నారు. ఆ భూమిని 120 ఎకరాలకు కుదించారని అన్నారు. ఆ భూమిని సాంకేతిక సాయంతో తిరిగి గుర్తించి బౌద్ధ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో పర్యటకశాఖ మంత్రి దుర్గేష్‌ని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆవేదన - మంత్రి దుర్గేష్‌కు లేఖ - Retired IAS EAS Sarma Letter - RETIRED IAS EAS SARMA LETTER
Retired IAS EAS Sarma Letter On Buddha Land Issues: విశాఖలో బౌద్ధ స్థలాల ఆక్రమణపై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్‌కి లేఖ రాశారు.
Retired IAS EAS Sarma Letter (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 9:24 PM IST