College Seats for Local Students only in Vijayawada :ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం నుంచి విజయవాడ ప్రభుత్వ దంత కళాశాలలోని బీడీఎస్, ఎండీఎస్ కోర్సుల సీట్లను ఇక నుంచి ఆంధ్ర ప్రాంత విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జీవోను విడుదల చేసింది. పునర్విభజన చట్టంలో పొందుపరచిన విధంగా పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ 1 నాటికి పదేళ్ల గడువు ముగిసింది. విజయవాడలోని రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ దంత కళాశాలను ఇక నుంచి నాన్ స్టేట్‌వైడ్‌గా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్త కళాశాలగా ఇది ఉండడంతో 40 సీట్లలో ఏయూ పరిధిలోని విద్యార్థులకు 42శాతం, ఓయూ పరిధిలోని వారికి 36శాతం, ఎస్‌వీయూకు 22శాతం చొప్పున కేటాయించారు.
కాలేజీల్లో విద్యార్ధుల సర్టిఫికెట్లు - ఇప్పించేలా కూటమి సర్కారు కసరత్తు - Student Certificates
సీట్ల కేటాయింపు :2024-25 ఏడాది నుంచి నాన్ స్టేట్‌వైడ్ కళాశాలగా మారడంతో 85శాతం సీట్లను ఏయూ రీజియన్ పరిధిలోని విద్యార్థులకే కేటాయిస్తారు. 15శాతం సీట్లను నాన్‌లోకల్ కోటా కింద ఏయూ, ఎస్‌వీయూ 2 రీజియన్ల పరిధిలోని వారికి కేటాయిస్తారు. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఇప్పటివరకు నాన్‌లోకల్ -అన్‌రిజర్వ్‌డ్ కింద కేటాయిస్తున్న 15శాతం సీట్లను ఇక నుంచి ఏయూ, ఎస్వీయూ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది.
మార్గనిర్దేశాల జీవో :పీజీ మెడికల్ కోర్సుల ప్రవేశాల మార్గనిర్దేశాల జీవోను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గిరిజన, గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకొని పీజీ వైద్యవిద్య ప్రవే శాలను చేపట్టాలని విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సూచించింది. కేంద్ర వైద్య కళాశాలల్లో సీట్లు మినహా యించిన తర్వాత రాష్ట్ర కోటాలోని 50% సీట్లలో 15% క్లినికల్ సబ్జెక్టులకు కేటాయించాలన్నారు. ఈ సీట్లు జన రల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఎనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషాలిటీస్‌కు కేటాయించనున్నారు. మిగతా వాటిలో 30% సీట్లను నాన్ క్లినిక స్పెషాలిటీస్‌కు కేటాయించాలని ఆదేశించారు.
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు - ఆ కాలేజీల్లో ఎంతంటే? - ENGINEERING FEES in ap
నిబంధనలా ప్రకారం : ఇన్ సర్వీస్ అభ్యర్థుల్లో రెండేళ్లు గిరిజనా ప్రాంతాల్లో గానీ, మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో గానీ ఆరేళ్లు పట్టణ ప్రాంతాల్లో గానీ పనిచేసినవారే అర్హులని జీవోలో పేర్కొన్నారు. పీజీ మెడికల్ కోర్సుకు వయోప మితి 50 ఏళ్లు మించకూడదని నిబంధన ప్రవేశపెట్టారు. పీజీ దంత వైద్య కోర్సులకు దరఖాస్తులు 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని దంత వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎండీఎస్ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులు శనివారం నుంచి అందుబాటులో ఉంచారు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. యూనివర్సిటీ ప్రవేశాల లింక్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలి
తెలుగు పాఠశాలల్లో మరాఠీ పంతుళ్లు- అర్థంగాక తిప్పలు - MARATHI TEACHERS IN TELUGU SCHOOLS