ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యాశాఖలో ఆ జీఓ రద్దు - వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు - REPEAL OF GO 117 IN AP

ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డైరెక్టర్‌ విజయరామరాజు చర్చలు

REPEAL_OF_GO_117_IN_AP
REPEAL_OF_GO_117_IN_AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 8:30 AM IST

Repeal of GO 117 in School Education in AP : వైఎస్సార్సీపీ హయాంలో పాఠశాల విద్యలో అల్లకల్లోలం సృష్టించిన జీఓ-117ను వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్‌ లాంటి వాటిని అమలు చేసేందుకు తీసుకొచ్చిన జీఓ-117తో పాఠశాల విద్య సర్వనాశనమైంది.

గత ఎన్నికల సమయంలో జీఓ-117ను రద్దు చేస్తామని ఎన్డీయే కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు చేసి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డైరెక్టర్‌ విజయరామరాజు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా జగన్​ ప్రభుత్వ హయాంలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిగే ఇబ్బందులు నుంచి చర్చించారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

'నాకు ఉర్దూ రాదు విద్యార్థులకు తెలుగురాదు' - అధికారులకు ఉపాధ్యాయుడి మొర - Errors in Teacher transfers

ప్రతి మేజర్‌ పంచాయతీలోనూ ఒక మోడల్‌ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు డైరెక్టర్‌ విజయరామరాజు వెల్లడించారు. యాప్‌లను వీలైనంత వరకు సరళీకరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 11న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల దినోత్సవం, 14వ తేదీన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మెగా సమావేశం నిర్వహించనున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరవుతారని విజయరామరాజు వెల్లడించారు.

చిన్నారులను ఆకట్టుకొనేలా బోధన - ఈ మేడం చెప్పే పాఠాలంటే పిల్లలకు ఎంతో ఇష్టం - Special Story On Vijayawada Teacher

పదోన్నతులు, బదిలీలపై వచ్చే వారం చర్చ :ఇక నుంచి రెండు నెలల పాటు ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో ఒక్కో అంశంపై చర్చించినట్లు విజయ రామరాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. వచ్చే వారం పదోన్నతులు, బదిలీలపై వంటి అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించిన రెసిడెన్షియల్‌ శిక్షణను మార్చాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు.

ఉపాధ్యాయులకు వారానికి 32 పీరియడ్లకు మించి బోధన విధులు ఉండకూడదని నాయకులు డైరెక్టర్​ విజయరామరాజుకు విన్నవించారు. 2017లో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు-29, 42, 53 అమలు చేయాలని కోరుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సబ్జెక్టు టీచర్లతోనే బోధించాలని తెలియజేశారు. ఇంగ్లీషు మీడియం పాటు తెలుగు మాధ్యమాన్ని అమలు చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 20 మించి ఉంటే ఇద్దరు ఎస్జీటీలను (SGT) ఇవ్వాలని ఏపీ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ కోరింది.

ఎన్నిసార్లు చెప్పిన వినడంలేదని- విద్యార్థులకు హెయిర్​ కట్ చేసిన టీచర్

ABOUT THE AUTHOR

...view details