Rapid Sanitation Works in Flooded Areas in Vijayawada : విజయవాడలో యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం సహాయచర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఫైరింజన్ల, పారిశుద్ధ్య కార్మికులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. సెలవులు కూడా తీసుకోకుండా సహాయ చర్యలను అధికార యంత్రాంగం చేపట్టింది. సహాయచర్యలను మంత్రులు ఎప్పుడికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.
Fire Engine Staff Removing Mud on Flood Areas in Vijayawada : విజయవాడలో వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు శుభ్రం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 113 ఫైరింజిన్లను విజయవాడకు చేరుకున్నాయి. బుధవారం 50 ఫైరింజిన్లతో పనులు మొదలుపెట్టిన అధికారులు, ఇవాళ మరింత జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూనే, వరద తగ్గిన ప్రాంతాల్లో బాధితుల ఇళ్లు, వీధులను శుభ్రం చేసేందుకు ఫైరింజిన్ల వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆక్రమణల చెరలో ఉప్పుటేరు- దారిలేక లంకగ్రామాలను కుమ్మేస్తోన్న బుడమేరు - Kolleru Lanka Stuck in Flood Effect
మొత్తం 32 డివిజన్లలో ముంపు : విజయవాడలోని మొత్తం 32 డివిజన్లలో ముంపునకు గురైనట్లు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఏ రోజుకు ఆ రోజు ఇళ్లను శుభ్రం చేస్తున్నామని తెలియజేశారు. చాలా ప్రాంతాల్లో బాధితులు రోడ్డుపైన నిలిచిన నీటితోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లలోకి చేరిన వరద కారణంగా పలు వస్తువులు కొట్టుకుపోవడంతో పాటు, ఉన్నవి కూడా పాడయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.