ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వామ్మో ప్రెస్ మీట్ లా - యూట్యూబర్లతో బెంబేలెత్తుతున్న రాజకీయ నాయకులు.! - YouTube channels - YOUTUBE CHANNELS

YouTube channels: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో యూట్యూబ్ ఛానల్స్ అడ్డు అదుపు పుట్టుకస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు ప్రెస్ మీట్​లు పెట్టాలంటే నిజమైన జర్నలిస్టులు ఎవరు? యూట్యూబర్​లు ఎవరో, శాటిలైట్ ఛానల్ ఏమి ఉన్నాయి అని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం .

YouTube channels
YouTube channels

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 4:49 PM IST

YouTube channels: కొంతమంది యూట్యూబర్​లు మాది మంచి ఛానల్ అని, మేమే ఇక్కడ అన్ని చూసుకుంటామని, మీరు పెట్టే ప్రోగ్రామ్స్ అన్ని మేమే దగ్గరుండి చూసుకుంటామనే, పేటీఎం బ్యాచ్ లు ఎక్కువయ్యారు. ఒక ఇంటిలో ముగ్గురు నలుగురు పేర్లుతో కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసి, వారే లోగోలు తయారు చేసుకుని, వారే యాంకర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెడితే ఒక కుటుంబంలో ముగ్గురు లేక నలుగురు యూట్యూబ్ గొట్టాలు వేసుకుని వచ్చేస్తున్నారు. గ్రూపుల్లో యూట్యూబ్ లింకులు పెడుతూ వాటిని ఓపెన్ చేయగానే ఆయా యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ల వాయిస్ వినలేక ప్రజలు, రాజకీయ నాయకులు సమాజంలో మీడియా అంటేనే ఛీ తూ అనే విధంగా తయారైంది.

ఒక ప్రెస్ మీట్ పెడితే యూట్యూబర్ లతో కలిపి నకిలీ విలేకరులు సుమారుగా 150 మంది ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే బాగా ఖర్చవుతుందని రాజకీయ నాయకులు లబోదిబోమంటున్నారు. వీరంతా ప్రెస్ మీట్లకు వచ్చేది ఎందుకు వారిచ్చే కవర్ల కోసమా, సమాజంలో జరుగుతున్న చెడుపై వార్తలు రాసే వారు ఎంతమంది ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నిలబడే వారు ఎంతమంది ఉన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అలాంటి ప్రాంతంలో వీరెందుకు అక్కడికి వెళ్ళరు. సమస్యలున్న ప్రాంతానికి వెళ్తే అక్కడ డబ్బులు రావా, ప్రెస్ మీట్లకు వెళితే టిఫిన్లు భోజనాలు పెట్టి డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో నే ఇలా చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు షాక్​.. యూట్యూబ్​ ఛానెళ్లు బంద్ చేస్కోవాల్సిందే!

ఒకప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఆయా ప్రాంతాల్లో ఉండే విలేకరులకు మాత్రమే ఫోన్ చేసి చెప్తారు. కానీ ఇప్పుడు గ్రూపులో ప్రెస్ మీట్ ఉందని మెసేజ్ పెట్టగానే చైన్ లింకు సిస్టం ద్వారా వందల మంది ప్రెస్ మీట్ కి వచ్చేస్తుంటే, ఆ ప్రెస్ మీట్ పెట్టేవారు వారి ముందు ఉన్నది శాటిలైట్ ఛానల్ లేక యూట్యూబ్ ఛానల్ అని వారి ముందు పదుల సంఖ్యలో ఉన్న ఆ గొట్టాలు చూసి భయపడి పోతున్నారు. మా నియోజకవర్గం విలేకరులకు మాత్రమే గెట్ టుగెదర్ అని ఎమ్మెల్యే అభ్యర్థులు వారి పీఆర్ఓలతో జర్నలిస్టులకు ఫోన్లు చేస్తుంటే, ఆ గెట్ టుగెదర్ కి వచ్చేది మాత్రం 150 మందికి పై మాటే.. పిలవని పేరంటానికి వెళ్లడం మీడియా రంగ పరువు గంగలో కలుపుతున్నారు.

ఇకనుంచి ప్రెస్ మీట్ లు పెట్టాలంటే వారు కచ్చితంగా ప్రెస్ మీట్ సోషల్ మీడియా వారికి మాత్రమేనని, లేక యూట్యూబ్ ఛానల్ కు మాత్రమేనని, లేక ఎలక్ట్రానిక్ మీడియా వారికి మాత్రమేనని, లేక ప్రింట్ మీడియా వారికి మాత్రమేనని పెడితే, అప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టే వారి ఖర్చు తగ్గుతుంది, వారు ప్రెస్ మీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో ఆ ప్రెస్ మీట్ పెట్టినందుకు న్యాయం జరుగుతుందని రాజకీయ నాయకులు విశ్లేషించుకుంటున్నారు..

అందరూ సమాజంలో ఇలా కనక చేస్తే ముఠామేస్త్రిలు, తాపీ పని చేసుకునే వాళ్లు, పునుగులు, బజ్జీలు నూడిల్స్ అమ్ముకునేవారు మీడియా రంగంలోకి రాకుండా వారి పని వారు చేసుకుంటే ఫోర్త్ ఎస్టేట్ పరువు నిలబడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Top 10 YouTubers In India : టాప్​-10 ఇండియన్​ యూట్యూబర్స్.. సక్సెస్ మంత్రం ఏమిటి?

ABOUT THE AUTHOR

...view details