Political Parties Has Intensified Campaign For General Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. బహుముఖ వ్యూహాలతో అన్ని పార్టీలూ రణానికి సన్నద్ధమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలని నిర్ణయించడంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కూటమిని గెలిపించాలని నేతలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని మూడు పార్టీల నేతలు ప్రజలకు వివరించారు. వైసీపీ నుంచి నాయకుల వలసలు కొనసాగాయి.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్- వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే వీల్లేదు : CEO
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును జనసేన నేత కందుల దుర్గేష్ కలిశారు. తన విజయానికి సహకరించాలని ఆయన కోరారు. అనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మద్ధతుగా అయన అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు నరసాపురం నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చిలకలూరిపేటలో జరగనున్న ఉమ్మడి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన వైసీపీ నేత బాచిన కృష్ణ చైతన్య తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఎన్నికల షెడ్యూల్ రాకతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది - వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది: చంద్రబాబు