ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగని గంజాయి విక్రయాలు - మత్తుకు బానిసవుతున్న యువత - Ganja found in Gopalapatnam

AP Youth in Ganja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. దీనివల్ల స్కూల్ పిల్లల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు గంజాయికి బానిసలు అవుతున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు విశాఖ ఏజెన్సీతో ముడిపడి ఉంటున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గోపాలపట్నం టాస్క్ ఫోర్స్ ఆపరేషన్​లో భాగంగా ఓ దుకాణంలో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police_Seized_Ganja_From_Shop_In_Gopalapatnam
Police_Seized_Ganja_From_Shop_In_Gopalapatnam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 12:54 PM IST

Updated : Mar 22, 2024, 4:24 PM IST

AP Youth in Ganja: రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన యువత గంజాయి మత్తులో చిత్తవుతోంది. కిక్కు కోసం, కొత్తదనం కోసం కొందరు విద్యార్థులు మత్తుకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిషాలో తూగుతున్నారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయిని సేవిస్తూ ఆ కిక్కులో అడ్డదార్లు తొక్కుతూ కొందరు నేరస్తులుగానూ మారుతున్నారు.

బెజవాడలో గంజాయి దందా చాపకింద నీరులా మత్తుగా విస్తరిస్తోంది. నగర శివార్లలో, నిర్మానుష్య ప్రాంతాల్లో విద్యార్థులు గంజాయి సేవించి మత్తులో జోగుతున్నారు. నున్న, అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, ఈడుపుగల్లు, గన్నవరం ప్రాంతాల్లో విచ్చల విడిగా మత్తు దందా సాగుతోంది. పాడు పడిన భవనాలు, బ్రిడ్జిల కింద అడ్డాలు ఏర్పాటు చేసుకుని యువకులు మత్తులో తేలుతున్నారు. కొందరు యువకులు మత్తులో మహిళలను వేధిస్తుంటే మరికొందరు దాడులకు సైతం తెగబడుతున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు దళారులు విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని నగరానికి తెస్తున్నారు. ఆవారాగా తిరిగే వారిని, బిచ్చగాళ్లను మధ్యవర్తులుగా పెడుతున్నారు. పాఠశాలల వద్ద ఉంటే పాన్ షాపులు, ఐసీక్రీమ్ బండ్లు లాంటివి అడ్డాలుగా ఏర్పాటు చేస్తున్నారు. తొలుత విద్యార్థులకు గంజాయి మత్తును అలవాటు చేసి ఆపై కొన్ని పొట్లాలు విక్రయిస్తే కమిషన్ ఇస్తామని ఎర వేస్తున్నారు. గంజాయి కొనేందుకు నగదు లేక కమిషన్ కోసం గంజాయి విక్రయదారులుగా మారుతున్నారు.

ఆగని గంజాయి విక్రయాలు - మత్తుకు బానిసవుతున్న యువత

కంది చేనులో గంజాయి- గ్రామ శివారులో భారీగా సాగు

అభివృద్ధి బాటలో నడవాల్సిన యువత గంజాయి మత్తులో నేరాల బాట పడుతోంది. విజయవాడకు విశాఖ ఏజెన్సీ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు ఈ దందాకు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హైదరాబాద్​లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ దందా లింకులు విజయవాడలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. గంజాయి దందా గురించి పోలీసులకు తెలిసినా అరకొర చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించిన గంజాయి లారీ - సినిమా స్టైల్​లో ఛేజ్​

రాష్ట్రం నుంచే తెలంగాణ, చెన్నై, బెంగళూరు, ముంబయి, పుణెలకు గంజాయి రవాణా అవుతోంది. గంజాయి రవాణా చేసే కొరియర్లనే పట్టుకుంటున్న పోలీసులు దందా వెనక ఉన్న కీలక నిందితుల గురించి ఆరా కూడా తీయట్లేదు. వీరికి స్థానిక నేతల అండ ఉండటమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్జన కోసం యువత జీవితం నాశనం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గంజాయి, మద్యం పట్టుకునేందుకు ఎస్​ఈబీ (SEB) పేరుతో ప్రభుత్వం ప్రత్యేక వింగ్​ను ఏర్పాటు చేసి కొద్దిరోజులు హడావుడి చేసింది. ఆ తర్వాత అంతా మాములేనని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Police Seized Ganja In Gopalapatnam: విశాఖ జిల్లా గోపాలపట్నం టాస్క్ ఫోర్స్ ఆపరేషన్​లో భాగంగా ఓ దుకాణంలో 110 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తరలిస్తున్నారని వీటి విలువ సుమారు 55 లక్షల రూపాయలు ఉంటుందని డీసీపీ (DCP) సత్యబాబు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురి నిందితులను అదుపులోకి తీసుకొన్నామని మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి 3 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఆటో సీజ్ చేశామని స్పష్టం చేశారు.

కంటైనర్​లో తరలిస్తున్న 450 కిలోల గంజాయి పట్టివేత - నిందితులు అరెస్ట్

Ganja supply Gang Arrest in Chittor: చిత్తూరు జిల్లా పలమనేరు, వీకోట పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్నట్టు ముందస్తు సమాచారం అందటంతో హుటాహుటీన అక్కడికి చేరుకుని ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని బైరెడ్డిపల్లి పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని దీని విలువ రూ. 7 లక్షలు విలువ ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఆటో, 4 బైకులు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ 3లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

నిందితులను (సలీమ్, వెంకటేష్) అదుపులోకి తీసుకుని విచారిస్తే చింతపల్లి, విశాఖపట్నం నుంచి కొంత మంది వ్యక్తుల నుంచి 5 వేలకు కనుగోలు చేసి చిత్తూరుకు తీసుకువచ్చి 30 వేల రూపాయిలకు పైబడి అమ్మకాలు జరుపుతున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి కనుగోలు చేసిన స్థానికులు 10 గ్రాములు రూ. 300- 700లకు విక్రయించి 70వేల రూపాయిలకు అమ్మకాలు జరుపుతున్నట్టు నిందితులు తెలిపారు. చుట్టు పక్కల వేరే వ్యక్తులు గంజాయి విక్రయం జరుగుతున్నట్టు సమాచారం ఉందని, వారిపై కూడా నిఘా పెట్టామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Last Updated : Mar 22, 2024, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details