Borugadda Anil in Police Custody:రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. తుళ్లూరులో మార్చిలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అనిల్‌ను తమ కస్టడీ కి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఒక్కరోజు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ రోజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి పోలీసు బందోబస్తు మధ్య తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారణ పూర్తైన అనంతరం తుళ్లూరు పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. మరో కేసులో మంగళవారం తుళ్లూరు పోలీసులు అనిల్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. మంగళవారం జరిగే విచారణకు హాజరుకాలేనని తనకు అనారోగ్యంగా ఉందని అనిల్ న్యాయమూర్తికి చెప్పగా మెడికల్ సర్టిఫికెట్ ఉందా? అని ప్రశ్నించారు. లేదని చెప్పడంతో మంగళవారం విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.