తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంట్లో చెప్పకుండా బీచ్​కు వెళ్లిన బాలికలు - ఆచూకీ కనిపెట్టిన ఇన్​స్టాగ్రామ్​

బీచ్​కు వెళ్లాలని అనుకున్న ఇద్దరు బాలికలు - బస్సులు వెళుతుండగా ఇన్​స్ట్రాగ్రామ్​ ఐడీతో పట్టుకున్న పోలీసులు - హైదరాబాద్​లో జరిగిన ఘటన

BAPATLA BEACH IN AP
GIRLS FOUND WITH INSTAGRAM (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 2:03 PM IST

Updated : Nov 22, 2024, 3:26 PM IST

Instagram : చదువుకునే రోజుల్లో స్నేహితులంతా కలిసి ఏదైనా ట్రిప్​ వేద్దామని చూస్తారు. ట్రిప్​లో భాగంగా దూర ప్రాంతాలకు వెళ్లడం.. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే మాత్రం ట్రిప్​ అనగానే ముందుగా గోవా వెళదామా మామా..! అంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి అక్కడ బీచ్​లలో సేద తీరి, ఎంజాయ్​ చేయాలని అనుకుంటారు. అమ్మాయిలు అయితే మాత్రం ఎక్కడికి వారంతా సింగిల్​గా వెళ్లరు.. అలాగని కలిసి వెళ్లరు. కానీ ఇక్కడ ఈ అమ్మాయిలు ఇద్దరు మాత్రం బీచ్​కు వెళ్లాలని ప్లాన్​ చేసుకున్నారు. పైగా వారు చదివేది ఎనిమిదో తరగతి. ఎలా వెళ్లారు.. ఎక్కడకు వెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

హైదరాబాద్​లోని కూకట్​పల్లి బాలాజీనగర్​, ఆల్విన్​ కాలనీలకు చెందిన ఇద్దరు బాలికలు అక్కడ వివేకానందనగర్​లోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరిలో ఓ బాలిక సొంతూరు ఏపీలోని బాపట్ల సమీపంలోని ఓ చిన్న గ్రామం. ఆమె అక్కడ ఉండే సూర్యలంక బీచ్​ గురించి తరచూ ఇంకో బాలికకు చెబుతూ ఉండేది. దీంతో ఆ బాలికకు బీచ్​కు వెళ్లాలనే ఆసక్తి పెరిగింది. ఇద్దరూ కలిసి వెళ్లాలని అనుకున్నారు. రోజూ మాదిరిగానే ఈనెల 20న బాలిక తల్లి పాఠశాల వద్ద వాహనంపై దింపి వెళ్లిపోయింది.

తిరిగి సాయంత్రం స్కూల్​ విడిచిపెట్టే సమయానికి వెళ్లింది. తీరా చూస్తే తన కుమార్తె కనిపించకుండా పోయింది. తనతో పాటు మరో బాలిక కూడా కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన రెండు కుటుంబాల తల్లిదండ్రులు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్​ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాల పరిసరాల్లోని సీసీ కెమెరాలలో రికార్డయిన ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ గుడి సమీపంలోని నిర్మాణ భవనంలోకి స్కూల్​ యూనిఫామ్​లో వెళ్లిన ఆ ఇద్దరు బాలికలు సాధారణ దుస్తులతో బయటకు రావడం పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమయిన పోలీసులు వారి ఇన్​స్టాగ్రామ్ లోకేషన్​ ఆధారంగా ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల వైపు వెళుతున్నట్లు పక్కా సమాచారం సేకరించారు.

సూర్యలంక బీచ్​ మార్గంలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం బయలుదేరి బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి బాలికలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరి విద్యార్థినీ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. వారు హైదరాబాద్​ చేరుకున్నాక ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నారు. దీంతో ఇద్దరి బాలికల కథ సుఖాంతమైంది.

Goa Trip Travel Guide for First Time Visitors : గోవా టూర్​ సరే.. అక్కడికెళ్లి ఏం చూస్తారు..? మీ కోసం కంప్లీట్ ట్రావెల్ గైడ్..

బీచ్​లో 'బుట్టబొమ్మ'.. అనికా సురేంద్రన్ క్యూట్ స్టిల్స్

Last Updated : Nov 22, 2024, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details