YSRCP Former MP Nandigam Suresh Arrested : గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్‌లు మొదలయ్యాయి. తెలుగుదేశం ఆఫీస్‌పై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.
Nandigam Suresh on TDP Office Attack Case :ఈ క్రమంలోనే సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు. అరెస్ట్ భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశారు. ఆయణ్ని పట్టుకునేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 12 బృందాలతో మాజీ ఎంపీపై ప్రత్యేక నిఘా పెట్టారు.
నందిగం సురేష్ వాహనం ఏ మార్గంలో వెళ్లింది? ఎక్కడ ఎంతసేపు ఉన్నారని విషయాలను సాంకేతిక సాయంతో పోలీసులు సేకరించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆయన పారిపోయేందుకు యత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో అక్కడ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య నందిగంను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడే కాసేపు విచారించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనంతరం నందిగంను మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు నందిగం సురేష్‌కు రెండు వారాల రిమాండ్ విధించింది. సురేష్‌ను కాసేపట్లో గుంటూరు జైలుకు తరలించే అవకాశం ఉంది. ఇదిలావుండగా పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లు మూసేసి ఎవర్నీ లోపలికి పంపించడం లేదు.
పరారీలో వైఎస్సార్సీపీ నేతలు :ఈ కేసుతో పాటు చంద్రబాబు నివాసం దాడి కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నేతలంతా పరారీలో ఉన్నాట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ ఇతర నిందితుల కోసం ముమ్మరంగా పోలీసుల వేట కొనసాగుతోంది. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త, వైసీపీ నేత శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ - AP HC on YSRCP Bail Petitions