Police Arrested Cheater in Satya sai District : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మోసగించిన కేటుగాడిని సత్యసాయి జిల్లా నల్ల చెరువు పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన చిన్న ఓబులేసు అలియాస్ మహేశ్వరరెడ్డిగా పేరు మార్చకుని ప్రజలను మోసగించేవాడు. ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి మండల వ్యాప్తంగా 19 మంది నుంచి 2.5 కోట్ల రూపాయలు కాజేశాడు.
ప్రజలను మోసగించిన కేటుగాడు :సత్యసాయి జిల్లాలో నల్లచెరువు మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ తక్కువ ధరలకే చక్కెర, సిగరెట్లు ఇస్తానంటూ చిన్నఓబులేసు స్థానికులను నమ్మించారు. వ్యాపారం పేరిట అప్పులు తీసుకుని వంచించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారు. డబ్బు తీసుకుని వడ్డీ చెల్లించపోవడంతో దామవాండ్ల పల్లికి చెందిన నీలకంఠారెడ్డి నిలదీయగా మోసం బయటపడింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఎంతో శ్రమించి ఎట్టకేలకు చిన్న ఓబులేసును అరెస్ట్ చేశారు.
వాలంటీర్ ఘరానా మోసం- అప్పు చేసి రూ.60 లక్షలతో పరారు - Volunteer Cheating