ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని ఫోన్ - బ్యాంకు ఖాతా నుంచి రూ.40 లక్షలు మాయం - POLICE ARRESTED CYBER CRIMINALS

అమాయకులను భయపెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు - విజయనగరంలో రూ.40 లక్షల రూపాయాలు కాజేసిన నేరగాళ్లు

police_arrested_cyber_criminals
police_arrested_cyber_criminals (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 8:16 PM IST

Updated : Dec 2, 2024, 10:11 PM IST

Police Arrested Cyber Criminals in Vizianagaram: 'హాలో నేను డీసీపీ మాట్లాడుతున్నాను.. మీ పేరు మీద ఒక పార్శిల్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి'.. సర్ సర్ అది మాది కాదు సార్. అయితే మీ ఖాతాల్లో ఉన్న నగదు మొత్తం వెంటనే మేము చెప్పిన బ్యాంకు అకౌంట్​కు ట్రాన్స్​ఫర్ చేయండి. విచారించి పార్శిల్ మీది కాకపోతే ఆ డబ్బు మీ బ్యాంకు ఖాతాకే తిరిగి పంపుతాం. ఇలా సైబర్ మోసగాళ్లు ఫోన్లు చేసి సామాన్యులను బెదిరించి డబ్బులు కాజేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయనగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే అక్టోబర్​ నెలలో జమ్ము కశ్మీర్, పుణెకు చెందిన సైబర్ మోసగాళ్లు డ్రగ్స్ పార్శిల్ పేరుతో విజయనగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు సుజాత కుమారి నుంచి రూ.40 లక్షల రూపాయలు కాజేశారు. తన ఖాతా నుంచి బదిలీ చేసిన నగదు ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో అనుమానించిన బాధితురాలు సైబర్ సెల్ 1930కి ఫిర్యాదు చేశారు. దీంతో నేరం వెలుగు చూసింది.

డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని ఫోన్ - బ్యాంకు ఖాతా నుంచి రూ.40 లక్షలు మాయం (ETV Bharat)

డ్రగ్స్ పార్సిల్ అంటూ మీకు ఫోన్ వచ్చిందా ? - అయితే ఏమాత్రం భయపడకండి

సుజాత కుమారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విజయనగరం ఒకటో పట్టణ పోలీసులు కేసును ఛేదించారు. డ్రగ్స్ పార్శిల్ పేరుతో డిజిటల్ అరెస్టు మోసానికి పాల్పడిన జమ్ము కశ్మీర్, పుణెకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 లక్షల నగదుతో పాటు, 9.5 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

రూ.6,79,000 పోగొట్టుకున్న సీఆర్పీఎఫ్ జవాన్:సైబర్ క్రైమ్ బారిన పడి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీరాముల నాయక్ తన బ్యాంకు ఖాతా నుంచి రూ.6,79,000 కోల్పోయాడు. శ్రీరాముల నాయక్ భార్య ప్రమీల బాయ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి తన గోడును విన్నవించారు. నెల రోజుల కిందట జియో నెట్​వర్క్ నుంచి 10 రూపాయలు రీఛార్జ్ చేసుకోమని ఫోన్ చేశారని రీఛార్జ్ చేసుకున్న తర్వాత తన భర్త శ్రీరామ్ నాయక్ బ్యాంకు ఖాతా నుంచి విడతలవారీగా రూ. 6,79,000 కాజేశారని తెలిపారు. విషయం తెలుసుకున్న తాము పెనుగొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఆశ చూపారు, యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు- కోటి రూపాయలు కొట్టేశారు

ఇంగ్లీష్, హిందీ​ వచ్చిన వారే టార్గెట్ - సీబీఐ, ఈడీ అంటూ దోపిడీ

Last Updated : Dec 2, 2024, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details