ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారావారిపల్లెలో సూర్యకాంతులు - పైలట్‌ ప్రాజెక్టుగా పీఎం సూర్యఘర్‌ పథకం - PILOT PROJECT TO POWER IN KUPPAM

నారావారిపల్లెలో 25 ఇళ్లకు సౌరపలకలు-ఉగాదిలోపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం

pilot_project_to_power_kuppam_with_solar_energy
pilot_project_to_power_kuppam_with_solar_energy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2025, 9:01 AM IST

Pilot Project to Power Kuppam With Solar Energy :ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో విద్యుత్‌ సౌరభాలు విరబూస్తున్నాయి. పీఎం సూర్యఘర్‌ పథకం అమలుకు నారావారిపల్లె సమీపంలోని ఎ.రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామాపురం పంచాయతీలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.

ఈ మూడు పంచాయతీల్లో 2300 ఇళ్లపై సౌరపలకలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సీఎం స్వగ్రామం కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలో 25 ఇళ్లకు సౌరపలకలు అమర్చారు. గ్రామంలో ఈ పనులన్నీ ఉగాదిలోపు పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పలకలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా, మిగిలిన వారికి బ్యాంకు రాయితీ కింద రుణంగా ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details