ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న వస్తున్నాడంటే జంకుతున్న ప్రజలు - మేమంతా సిద్ధం సభతో సామాన్యులు తప్పని అవస్థలు - CM Jagan Election Campaign

CM Jagan Election Campaign in Guntur District : సీఎం జగన్​ మేమంతా సిద్ధం సభతో సామాన్యులు, మహిళలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులను జగన్​ సభకు తరలించడంతో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరడానికి నానా అవస్థలు పడుతున్నారు.

cm_jagan_tour
cm_jagan_tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 12:01 PM IST

అన్న వస్తున్నాడంటే జంకుతున్న ప్రజలు - మేమంతా సిద్ధం సభతో సామాన్యులు, మహిళలకు తప్పని అవస్థలు

CM Jagan Election Campaign in Guntur District: సీఎం జగన్‌ బస్సు యాత్రతో ప్రజలకు అవస్థలు తప్పటంలేదు. గుంటూరు జిల్లాలో సీఎం పర్యటనతో మహిళలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపైనా ట్రాఫిక్‌ ఇక్కట్లు తప్పలేదు. అన్న వస్తున్నాడు అంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు.

Guntur District :సీఎం జగన్​ మోహన్​ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో నిర్వహించిన ' మేమంతా సిద్ధం' సభ అటు వైసీపీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ' మేమంతా సిద్ధం' సభకు జనాదరణ లేకపోవడంతో ఎలాగైనా మందబలం చూపించుకోవడానికి వైసీపీ నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో బస్టాండ్​లో బస్సులు లేక గమ్యస్థానాలకు చేరుకోలేక సాధారణ ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

సీఎం జగన్​కు దమ్ముంటే గుంటూరులో పోటీ చేయాలి: టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్​ - Pemmasani Challenge To CM Jagan

Palnadu District : పల్నాడు జిల్లా సత్తెనపల్లి, కంటెపూడి మీదుగా సాగిన సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు, మూడు గంటలు ఆలస్యమైంది. నేతలు తీసుకువచ్చిన జనం రహదారిపై మండుటెండలో ఇబ్బందులు పడ్డారు. చెట్ల నీడా లేక రహదారిపై నిలబడేందుకు మహిళలు అవస్థలు పడ్డారు. గుంటూరు జిల్లా మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు మీదుగా యాత్ర సాగిన నేపథ్యంలో సీఎం రాకకు ముందే పేరేచర్ల జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల వైపు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. పేరేచర్ల నుంచి పరిసర గ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు బస్సులు లేక ఆటోల్లో వెళ్లేందుకు అవస్థలు పడ్డారు.
జగన్‌ సభకు బస్సులు - జనానికి తప్పని తిప్పలు - CM Jagan Meetings

గుంటూరులోని చుట్టిగుంట సెంటర్ నుంచి ఏటుకూరు బైపాస్​కు సీఎం వెళ్లే క్రమంలో స్థానికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారి మీద ట్రాఫిక్ జామ్ అయి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏటుకూరు బైపాస్ వద్ద జరిగే బహిరంగ సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాలను వైసీపీ నేతలు తరలించగా బస్సులన్నీ జాతీయ రహదారిపైనే నిలిపేశారు. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది బస్సులను జాతీయ రహదారిపై ఇరువైపులా నిలిపేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి పోయింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర భారీగా స్తంభించింది.

ABOUT THE AUTHOR

...view details