water pollution problems in GVMC:సాధారణంగా నీరు ఏ రంగులో ఉంటుందని ఎవర్ని ప్రశ్నించినా, నీటికి రంగే ఉండదు కదా అని సమాధానమిస్తారు. కానీ ఆ ప్రాంతవాసులు మాత్రం తాము తాగే నీరు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు ఇలా రకరకాల వర్ణాలతో ఉంటుందని జవాబు చెప్తారు. అదేదో శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం కాదండోయ్! మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నేతల వైఫల్యం వల్ల మంచినీటికి ఏర్పడిన దుస్థితి. ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం మంచి నీటిని సరఫరా చేయలేకపోతుంది. విశాఖ రాష్ట్రానికే రాజధాని అని విశ్వ నగరంగా మార్చేస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ కనీసం ప్రజల గొంతు తడపలేకపోతే ఎలా అని స్థానికులు నిలదీస్తున్నారు.
మంచినీటి సమస్యతో ఇక్కట్లు పడుతున్న 50వేల మంది:ఇవీ మహా విశాఖ నగరవాసుల తాగునీటి కష్టాలు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవ, జీవీఎంసీ పరిధిలోని 11 , 12 , 13 డివిజన్లలో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. ఆరిలోవ ముడసరలోవ ప్రాంతానికి పక్కనే ఉంది. ఇక్కడ ఉన్న జలాశయం ద్వారా 3 లక్షల మందికి నీరు అందించే సామర్థ్యం ఉంది. కానీ క్రాంతి నగర్, రామకృష్ణాపురం పరిసరప్రాంతాల్లో ఉన్న 50వేల మందికి నీరందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోనీ ఇచ్చే నీళ్లకూ ఓ సమయం అంటూ ఉండదు. వారికి నచ్చినప్పుడు వదులుతారు. ఆ నీరు కూడా రంగుమారి, దుర్వాసనతో ఉంటోంది. కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఐదేళ్లుగా స్థానికులు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా, కూత వేటు దూరంలోఉన్న మేయర్ వెంకట హరికుమారికి మాత్రం వీరి కష్టాలు కనబడటం లేదు.
విజయనగరంలో దాహం కేకలు- వేసవికి ముందే మొదలైన నీటి కష్టాలు