People Suffering Due to Damaged Roads in Srikakulam District : శ్రీకాకుళం- ఆమదాలవలస రహదారి. ఈ పేరు వింటేనే ప్రజలు హడలిపోతున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కనీస మరమ్మతులు చేపట్టక గుంతల మయంగా మారి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై వెళ్లాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు.
గోతులతో అధ్వానంగా రహదారి :శ్రీకాకుళం-ఆమదాలవలస ప్రధాన రహదారి జిల్లాలో ఎంతో కీలకమైంది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారి ప్రస్తుతం గుంతల మయంగా మారింది. ఈ రహదారి అభివృద్ధి కోసం 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొంతమేర భూ సేకరణ చేసి పనులు ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే రహదారి మాత్రం అడుగడుగునా గుంతల మయంగా తయారైంది.
రహదారి ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ఫోకస్ - భద్రతా చర్యలకు ఆదేశం - Road Accidents Raised In AP
"గత ఐదేళ్లుగా ఈ రోడ్డు ఇలానే ఉంది. ఏ మాత్రం మార్పు చెందలేదు. రహదారిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి అధ్వాన్నంగా ఉంది. ఈ రహదారి వెంబడి రోజు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోతున్నారు. గత ప్రభుత్వం ఎలానో దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వమైన రోడ్లు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం"_ స్థానికులు, శ్రీకాకుళం