People Suffering Due to Damaged Roads in Prakasam District :గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రకాశం జిల్లాలోని గ్రామీణ రహదారులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయంగా మారి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే చాలు గోతులు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రకాశం జిల్లాలోని గ్రామీణ రహదారులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయంగా మారి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే చాలు గోతులు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనచోదకులు వాపోతున్నారు.
రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయం : ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రహదారులు గుంతలతో దర్శనమిస్తున్నాయి. ముండ్లమూరు - తాళ్లూరు, తాళ్లూరు- తూర్పుగంగవరంల మధ్య ఉన్న రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇరుకైన తారు రోడ్డు కాస్తా గుంతల దారిగా మారిపోయింది. 2014-19లో అప్పటి ప్రభుత్వం ముండ్లమూరు - తాళ్ళూరు మధ్య 9 కిలోమీటర్ల రహదారికి నిధులు మంజూరు చేసింది. దాదాపు 7.5 కిలోమీటర్ల పని అయిపోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మిగిలిన పని నిలిచిపోయింది. 1.5 కి.మీ రహదారిని కనీసం పట్టించుకోలేదు. మరోవైపు తాళ్ళూరు - తూర్పు గంగవరం రహదారి 6 కిలోమీటర్లు పూర్తి చెయ్యలేదు. మొత్తం గుంతలమయం అయ్యింది.
ఇవేమి రోడ్లు బాబోయ్ - అడుగుకో గుంత, గజానికో గొయ్యి - Damaged Roads in Srikakulam