People Stop YCP MLA Campaign in Kakinada District : 'ఓట్ల కోసం అయితే నేనే మీ దగ్గరకు వస్తా, మీ సమస్యలు పరిష్కారం కావలంటే మీరే నా వద్దకు రావాలి' ఇదీ ఓ వైఎస్సార్సీపీ శాసనసభ్యుని సమాధానం. ఆ మాట విన్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం చెందారు. ఇందుకేనా మీకు ఓట్లు వేసి గెలిపించింది అంటూ రోడ్డుపైనే నిలదీశారు. మా సమస్యలు పరిష్కరించమని గత 45 రోజులుగా దీక్ష చేస్తుంటే మీకు కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. అట్టాహాసంగా రెండు రోజుల క్రితమే ప్రచారం ప్రారంభించిన ఆ శాసనసభ్యునికి మూడోరోజే ప్రజల నుంచి నిరసనగళం వినిపించడంతో సమాధానం చెప్పలేక మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
'ఎన్నికల హామీ ఎందుకు మర్చిపోయారు..?' వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. దాచినా దాగని వీడియో
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ఉన్న కొన్ని భూములను కాకినాడ రూరల్ నియోజకవర్గం చెందిన వారికి పట్టాలుగా ఇచ్చేెందుకు స్థానిక వైసీపీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్థానిక గ్రామస్థులు 46 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సైతం సంఘీభావం తెలిపారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
People Angry With YCP MLA Ponnada : అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముమ్మిడివరం నియోజకవర్గనికి చెందిన వైసీపీ అభ్యర్ధి పొన్నాడ వెంకట సతీశ్ కుమార్ ప్రచారం ప్రారంభించారు. పొన్నాడ ప్రస్తుతం వైసీపీ తరపున రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మూడోరోజైనా నేడు తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామంలో ప్రచారానికి స్థానిక నాయకులతో కలిసి వచ్చారు. ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతనిని గ్రామంలోకి రాకుండా అడ్డుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.