ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊరు దాటాలంటే వాగు ఈదాల్సిందే- 'ఇకనైనా రహదారి నిర్మించరూ' - no Road Facility In Alluri district - NO ROAD FACILITY IN ALLURI DISTRICT

People Facing Problems Due to No Road Facility In Alluri District : దేశం ఎంత అభివృద్ది చెందుతున్నా, గ్రామాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నాయి పరిస్థితులు. పరిశ్రమలు, భవనాల మాట అటుంచితే కనీసం ఊరు దాటి వెళ్లడానికి రోడ్డు సదుపాయాలు కూడా లేని గ్రామాలూ అనేకం.

people_facing_problems_due_to_no_road_facility_in_alluri_district
people_facing_problems_due_to_no_road_facility_in_alluri_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 12:30 PM IST

People Facing Problems Due to No Road Facility In Alluri District :మెరుపు వేగంతో నడిచే యంత్రాలు, డ్రైవర్​ లేకుండా నడిచే వాహనాలు, ఏఐ, అధునాతన టెక్నాలజీ, స్పర్శతో, కంటి చూపుతో నియంత్రించగలిగే ఆవిష్కరణలు. సముద్రాలలో మెట్రోలు, నీటి మీద రాచ మార్గాలు, గాల్లో మెట్రో స్టేషన్లు​ ఇవన్నీ నాణానికి ఒకవైపు అయితే, కనీసం ఊరు దాటి వెళ్లడానికి కాలినడక కూడా లేని గ్రామాలూ ఉన్నాయి.

ప్రాణాలు పోతున్నా అరణ్య రోదనే తప్ప అంబులెన్స్ శబ్దం వినిపించని పల్లెలు. పురిటి నొప్పులు తెలియకుండా బిడ్డను కనేంత వెసులుబాటు కల్పించే సామర్థం ఉన్నా, గిరిజన ప్రాంతాల్లో తల్లులు కనీసం ఆస్పత్రికి వెళ్లడానికి ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితులున్నాయి. ఐదేళ్లకోసారి మారే రాజకీయనాయకులకు తరాతరాలుగా వాళ్ల బాధలు పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. అల్లూరి, మన్యం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనీసం రోడ్డు సదుపాయం లేక జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.

గాలి వానలో, వాగు నీటిలో పడవ ప్రయాణం- రహదారి తెలియదు పాపం! - Pudilanka peoples problem

అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలో రహదారి సౌకర్యం లేక లక్ష్మీపురం పంచాయతీ పరిధి గ్రామ ప్రజలు సాహసాలు చేస్తున్నారు. గ్రామంలోని వృద్ధురాలు మంగళవారం ఆనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులో ప్రయాణించారు. సోమవారం కూడా కొందరు యువకులు గ్రామాన్ని దాటి వెళ్లడానికి బైక్‌పై వెళ్తుండగా ప్రవహిస్తోన్న వాగు దాటుతున్నారు. ఈ క్రమంలో నీటి ఉద్ధృతికి బైక్‌ కొట్టుకుపోగా యువకులు కష్టపడి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. వర్షాలకు కల్వర్టులు కొట్టుకుపోవడంతో దొరగూడ, ఉబ్బెంగులు గ్రామస్థులు తరుచూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులో ప్రయాణిస్తున్నారు. అధికారులు ఇకనైనా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

స్కూల్​కు వెళ్లాలంటే టీచర్లు సాహసం చేయాల్సిందే - ఎందుకంటే ! - TEACHERS PROBLEMS TO GO TO SCHOOL

ఇదిలా ఉండగా ఏళ్లు గడుస్తున్నా పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు పూర్తికాలేదని ప్రజలు నిరసనల బాట పట్టారు. వంతెన పూర్తి చేస్తామని ఆరేళ్లుగా చెబుతున్నా పనులు మాత్రం సాగడం లేదని వాపోతున్నారు. వర్షాకాలంలో నది దాటలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details