People Dangerous Journey on Boat in Matsyagedda :అల్లూరి సీతారామరాజు సుజనకోట పంచాయతీలోని 14 గ్రామాలు మత్స్యగెడ్డ పరివాహకంలో ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు మత్స్యగెడ్డపై రాకపోకలు సాగించాలంటే కుమ్మరిపుట్టు వద్ద నాటుపడవలను ఆశ్రయిల్సిన పరిస్థితి నెలకొంది. పడవలు శిథిలమై, రంధ్రాలు పడి లోపలకు నీరు చేరతున్నాయి. దీంతో తాడు ఆధారంతో పడవలు నడుపుతున్నారు. స్థానికులు ప్రమాదమని తెలిసినా వాటిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం కురిసిన వానలకు సుజనపేట వద్ద కల్వర్టు కూలిపోయింది. దీంతో ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. కుమ్మరిపుట్టు వద్ద కాలిబాట వంతెన నిర్మించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.
రవాణా సేవలు దూరమై :దారెల పంచాయతీలోని రంగిలిసింగి, మురళిపుట్టు, డొక్రిపుట్టు, కుమ్మరిపుట్టు, పేటమాలిపుట్టు, పెదపేట గ్రామాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఈ గ్రామాలోని విద్యార్థులు, రైతులు, గిరిజనులు రాకపోకలు సాగించేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పెదపేట సమీపంలో నాటుపడవలను ఆశ్రయిస్తున్నారు. రోగులపేట, పెదపేట మధ్య వంతెన నిర్మిస్తే కేవలం ఒక కిలోమీటర్లు దూరం ప్రయాణించి పెదబయలు వెళ్లొచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వమేనా పెదపేట నుంచి మురళిపుట్టు వరకు, దారెల నుంచి పెదగుడ వరకు రోడ్డు నిర్మించి బస్సు సదుపాయం కల్పిస్తే రవాణా సేవలు మెరుగవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కూల్కు వెళ్లాలంటే పడవ ఎక్కాల్సిందే - ప్రమాదకరంగా విద్యార్థుల ప్రయాణం
ఏం చేస్తే ప్రయాజనం :సుజనకోట పంచాయతీలోని కుమ్మరిపుట్టు వద్ద తాడు ఆధారంగా నడిపే పడవలకు బదులుగా ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. కుమ్మరిపుట్టు నుంచి ముంచంగిపుట్టు వచ్చే మార్గంలో మత్స్యగెడ్డపై కాలిబాటను నిర్మిస్తే ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పెదపేట సమీపంలో రోగులపేటకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మించాలి. ఈ గ్రామాల ప్రజలకు రాకపోకలు సాగించేందుకు స్టీమర్ పడవలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.