People Complain to TDP Leaders on YSRCP Leaders Irregularities:వారసత్వంగా సంక్రమించిన భూమిని వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించి అధికారుల అండదండలతో ఆన్‌లైన్‌లో భూ రికార్డులు మర్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే హత్యాయత్నం చేసారని ఒంగోలుకు చెందిన వెంకటేశ్వరరావు వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 'ప్రజావేదిక'లో ఫిర్యాదు చేశారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, నేత డేగల ప్రభాకరరావు వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. పింఛన్ ఇవ్వడానికి సచివాలయ ఉద్యోగి లంచం డిమాండ్ చేశారని కడపకు చెందిన వృద్ధురాలు శివమ్మ వాపోయారు. తన వద్ద 15 లక్షలు తీసుకొని స్థలాన్ని అమ్మిన జగదీశ్వర్రావు అదే భూమిని మరొకరికి కూడా విక్రయించి మోసం చేశారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన మారుతీరావు ఫిర్యాదు చేసారు.