ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల హామీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన సంబరాలు - చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు - People celebration across the state - PEOPLE CELEBRATION ACROSS THE STATE

People Celebration Across the State : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐదు కీలక హామీలపై సంతకాలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, వికలాంగులు, ప్రజలు చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకాలతో కృతజ్ఞతలు తెలిపారు.

People Celebration Across the State
People Celebration Across the State (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 7:35 PM IST

ఎన్నికల హామీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన సంబరాలు - చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు (ETV Bharat)

People Celebration Across the State : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఐదు కీలక హామీలపై సంతకాలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టడంపై నిరుద్యోగ యువత సీఎం చిత్రపటానికి పాలభిషేకాలతో కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో మంత్రులకు శాఖలు కేటాయింపు- ఎవరెవరికి ఏ శాఖలంటే? - AP Ministers Portfolios

చంద్రబాబు చేసిన ఐదు సంతకాలపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఊరట కలిగించారన్నారు. సామాజిక భద్రతా పింఛన్లతో వృద్ధులు, వికలాంగులకు ఎంతగానో మేలు జరుగుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఐదు హామీలు అమలు చేయటంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేశారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదా - Pawan Kalyan Key Role in Cabinet

ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తొలి రోజే సంతకం చేయటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. రైతు నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో పొలాల్లో వేసిన జగనన్న సర్వే రాళ్లను కూల్చివేశారు. చంద్రబాబు చిత్రపటానికి పామాయిల్‌ గింజలతో అభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు రీసర్వే పాసు పుస్తకాల ప్రతులను చించి మంటల్లో వేసి తగలబెట్టారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పింఛన్ల పెంపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా డీఎస్సీని స్వాగతిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అచ్చెనాయుడుకు ధన్యవాదాలు చెబుతూ, నిరుద్యోగ యువత సంబరాలు జరుపుకున్నారు.

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌? - AP TDP NEW STATE PRESIDENT

ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారంటూ నిరుద్యోగులు, యువత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేయడం పట్ల ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 పోస్టులు భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం పెట్టడం నిరుద్యోగులకు ఊతమిచ్చిందన్నారు. గత ప్రభుత్వ హయంలో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డామన్నారు. టీడీపీ ప్రభుత్వం రావడం ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు.

చరిత్ర లిఖించిన చంద్రబాబు మూడో సంతకం- అరకోటికి పైగా ప్రజానీకానికి సామాజిక భద్రత

ABOUT THE AUTHOR

...view details