ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరుజల్లులకే చిగురుటాకులా వణుకుతున్న నెల్లూరు - భారీగా దెబ్బతిన్న రహదారులు - ROADS SITUATION IN NELLORE

వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పూర్తిగా దెబ్బతిన్న రహదారులు - గోతుల్లో వర్షపు నీరు నిలిచి ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు

People are Suffering due to Rain Water Standing on the Roads
People are Suffering due to Rain Water Standing on the Roads (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2024, 4:39 PM IST

People are Suffering due to Rain Water Standing on the Roads : గత ఐదేళ్లుగా జగన్‌ జమానాలో అస్తవ్యస్థంగా మారిన నెల్లూరు నగరంలోని రహదారులు ఇటీవల కురుస్తున్న వర్షాలకు మరింత చిధ్రమయ్యాయి. పెద్ద పెద్ద గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రహదారులు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరంలోని రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రహదారుల మరమ్మతులు చేపట్టకపోవడంతో పెద్దపెద్ద గుంతలు తేలాయి. ప్రధాన కూడళ్లలో రహదారులు పాడయ్యాయి. పొదలకూరు రోడ్డు, జీటీ రోడ్డులోని కరెంట్ ఆఫీస్ సెంటర్, శివారులోని ఎన్డీఆర్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, YSR నగర్, శ్రామిక నగర్, పోలీస్ కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షపు నీరు కాలనీల్లోకి చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

అల్పపీడనం ప్రభావం - ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు - Heavy rains in Prakasam district

భారీ వర్షాలు వచ్చిన సమయంలో నీరు వెళ్లడానికి అస్కారం లేక రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలుస్తుందని స్థానికులు తెలిపారు. నగర నడిబొడ్డులోని సండే మార్కెట్, పొగతోట, ఆత్మకూరు రైల్వే వంతెన కింద నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో వర్షపు నీరు రోజుల కొద్ది నిలిచిపోవడంతో దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఎప్పుడు కురిసినా ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూటమి ప్రభుత్వం స్పందించి నూతన రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

"వర్షం పడితే ఎక్కడినీరు అక్కడే ఆగిపోతొంది. చిన్న వర్షం పడిన మోకాళ్లలోతు వరకూ నీళ్లు ఆగుతున్నాయి. నీళ్లు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే వాహనాలకు ఇంటికి కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు.రోడ్లపైనే వదిలేయ్యాలి. ఆటోలు సైతం తరచూ రిపేర్లు వస్తున్నాయి. నీళ్లు ఆగినప్పుడు అధికారులు వచ్చి హడావిడి చేస్తున్నారు.ఇంతవరకు శాశ్వత పరిష్కరం చూపలేదు. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలి." - స్థానికులు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. రోడ్లపై తిరిగే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రైతులు ఇప్పుడిప్పుడే వరి నార్లు, నాట్లు వేసిన రైతులు ఈ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు

"ఇదెక్కడి వాతావరణం" రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ - ఎటు చూసినా ఎండే

ABOUT THE AUTHOR

...view details