PARITALA RAVI MURDER CASE :పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది . A3 పండుగ నారాయణరెడ్డి, A4 రేఖమయ్య, A5 బజన రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. 25 వేల రూపాయల చొప్పున రెండు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొంది. నిందితులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ప్రతి సోమవారం 11 గంటలకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ముందు హాజరుకావాలని తెలిపింది. చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటే బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
పరిటాల రవి హత్య కేసు - ఐదుగురు నిందితులకు బెయిల్ - PARITALA RAVI MURDER CASE
18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు - అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల హత్య
PARITALA RAVI MURDER CASE (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2024, 6:15 PM IST
|Updated : Dec 18, 2024, 7:36 PM IST
2005లో జరిగిన మాజీమంత్రి పరిటాల రవి హత్యకేసులో నిందితులకు కింది కోర్టు గతంలో శిక్ష విధించింది. గత 18 ఏళ్లుగా నిందితులు జైల్లోనే ఉంటున్నారు. అయితే, కింది కోర్టు విధించిన శిక్షపై హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. తాజాగా నిందితులు బెయిల్ కోరటంతో ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
Last Updated : Dec 18, 2024, 7:36 PM IST