ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పండుగ - స్వయంగా పంపిణీ చేసిన నేతలు - pension distribution in ap - PENSION DISTRIBUTION IN AP

NTR Bharosa Pension Distribution Program Across State: రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో పండుగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు. కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలుగా అందాల్సిన మెుత్తం కలిపి 7వేల రూపాయలు అందజేశారు. ఇళ్లవద్దనేే పెన్షన్ పంపిణీ చేయటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

pension_distribution_in_ap
pension_distribution_in_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 4:41 PM IST

NTR Bharosa Pension Distribution Program Across State:పెంచిన పింఛన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. లబ్ధిదారులకు ఇంటివద్దే 7 వేల రూపాయలు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్​ను 4 వేల రూపాయలకు పెంచారని లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేశారు.

East Godavari District:తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి పాల్గొన్నారు. బత్తుల బలరామకృష్ణ, వెంకట రమణచౌదరి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఫించన్ పంపిణీ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.

Konaseema District:కోనసీమ జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. రామచంద్రపురం నియోజవర్గంలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం మురమళ్ల, కాట్రేనికోన గ్రామాల్లో MLA దాట్ల సుబ్బరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Eluru District:ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం కొనసాగుతోంది. నూజివీడులో సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దొండపాడులోని వీవర్స్ కాలనీలో పెన్షన్ పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం నాయకులు ఘనంగా నిర్వహించారు.

Visakha District:విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పింఛన్లు పంపిణీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. మధురవాడ ప్రాంతంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పింఛన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ ను పెంచినందుకు లబ్ధిదారులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Alluri District:అల్లూరి జిల్లా పాత పాడేరులో టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుండ్రుపుట్టు, గుడివాడ, లోచలిపుట్టులో గిడ్డి ఈశ్వరి పంపిణీ చేశారు.

Anakapalli District:పింఛన్ పెంచినందుకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో లబ్ధిదారులు చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణ, కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేశారు. పింఛన్ 4వేల రూపాయలు చేసినందుకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన పింఛన్ దారులు సంతోషం వ్యక్తంచేశారు.

నా దేశం, నేల కోసం పని చేస్తా - జీతం వద్దు : పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Speech in Gollaprolu

NTR District:ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజరాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పెన్షన్లు అందించారు. జగన్ లబ్ధిదారులను మోసం చేశారని చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచారని కొనియాడారు. ఇవాళ పేదలకు పండుగ రోజు అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే పెన్షన్ తమకు ఎంతగానే తోడ్పాటును అందిస్తోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Bapatla District:బాపట్ల నియోజకవర్గం పాండురంగాపురంలో పెన్షన్ల పంపిణీని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రారంభించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు దివ్యాంగులు ఉన్నారన్నారని వారికి గత పది సంవత్సరాలుగా వేగేసిన ఫౌండేషన్ ద్వారా 4500 ప్రతినెలా ఇస్తున్నామన్నారు.

Prakasam District:ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో సంక్షేమ శాఖా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. తుర్పున్నాయుడుపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతంర ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసారు. గిద్దలూరు నియోజకవర్గంలో పెన్షన్ల కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. దర్శిలో కూటమి నేతలు లబ్ధిదారులకు ఫించన్​ను ఇంటింటికి వెళ్లి అందజేశారు.

Nellore District:నెల్లూరు జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామానారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

joint Kurnool District:ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇళ్లవద్దనే పింఛన్లు పంపిణీ చేయటం పట్ల వృద్ధులు, వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణం తెలుగు పేటలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాణ్యం నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి, కూటమి నేతలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ తిరిగి పింఛన్లు అందజేశారు. నంద్యాలలో నస్యం వీధిలో మంత్రి ఫరూక్ వృద్ధులకు పింఛన్ పంపిణీ చేశారు.

New Pension in AP: మీకూ పెన్షన్​ కావాలా? అయితే దరఖాస్తు చేసుకోండిలా! - HOW TO APPLY FOR NEW PENSION in AP

YSR District:వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ వృద్ధులకు పింఛన్లను పంపిణీ చేశారు. కడప నగరంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేత బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అవ్వ, తాతలకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. కమలాపురంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.

Anantapur District:అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు, అధికారులు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చారు. కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేశారు. ఉరవకొండ మండలం కౌకుంట్లలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్‌ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఉరవకొండ పట్టణంలోని పాతపేటలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్​తో కలిసి మంత్రి పయ్యావుల పింఛన్లను పంపిణీ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ బికే పార్థసార్థిలు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.

joint Chittoor district:ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ ఇళ్ల వద్దే జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని తిరుపతి నగరంలో మేయర్‍ శిరీషాతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అందజేశారు. పలమనేరు మున్సిపాలిటీ బొమ్మిదొడ్డిలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ రెడ్డి లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ అందజేశారు. తిరుపతి జిల్లా, నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని పింఛనుదారులకు టీడీపీ ఇన్ ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పింఛన్లు పంపిణీ చేశారు. పూతలపట్టు మండలంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళి మోహన్ పింఛన్లు పంపిణీ చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జ్‌ చల్లా బాబు లబ్ధిదారులకు పింఛను నగదు అందజేశారు.

Sri Sathya Sai District:శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పింఛను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దనే పించిని పంపిణీ చేస్తున్నారన్నారు. కదిరిలో టీడీపీ నేత కందికుంట ప్రసాద్‌ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వృద్ధులకు సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేశారు.

Annamaya District:అన్నమయ్య జిల్లా నందులూరులో ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ 4 వేలకు పింఛను పెంచి గత మూడు నెలలతో కలిపి 7 వేల రూపాయలు అందజేశారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

సీఎం 4.0ను చూస్తారు - చంద్రబాబు, లోకేశ్​ మధ్య ఆసక్తికర సంభాషణ - Chandrababu and Lokesh Conversation

ABOUT THE AUTHOR

...view details