No Zika Virus Symptoms in Venkatapuram :నెల్లూరు జిల్లాలో వారం రోజులుగా జికా వైరస్ కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ప్రత్యేక వైద్య సిబ్బంది ఆ గ్రామంలో పర్యటించారు. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ లేదని అధికారులు తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితం ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానంతో చెన్నైకి తరలించారు. జికా వైరస్ కలకలంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
జీజీహెచ్ వైద్యులతో పాటు వెంకటాపురానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరం కూడా కేటాయించారు. గ్రామంలో శుభ్రత కోసం బ్లిచింగ్ పౌడర్, రోడ్లపై ఉన్న మురుగు నీరు తొలగించడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వైద్యులు బాలుడితో సహా మరో 21 మంది గ్రామస్థుల బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షల కోసం పూణే ల్యాబ్ కు పంపించారు. బాలుడితో సహా మొత్తం 22 మందికి నెగిటివ్ వచ్చిందని, పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించిందని డాక్టర్ గోపినాథ్ తెలిపారు. జికా వైరస్ వదంతులతో వారం రోజులుగా తీవ్ర భయాందోళనలో ఉన్న గ్రామస్థులకు జికా వైరస్ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పిల్లల మరణానికి కారణమవుతున్న 'చాందీపురా వైరస్' - ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే! - What Is Chandipura Virus
"వెంకటాపురంలో జికా వైరస్ ఉందని ప్రజలు భయపడ్డారు. దీంతో 22 మంది గ్రామస్థుల బ్లడ్ శాంపిల్స్ పూణే ల్యాబ్‌కు పంపించాం. 22 మందికి నెగిటివ్ వచ్చింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి."- డాక్టర్ గోపినాథ్
Seven Years Old Boy Suspected To Infected With Zika Virus :నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేప. మర్రిపాడు మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలుడికి వారం రోజుల క్రితం ఫిట్స్ వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి ఏదో వైరస్ సోకినట్లుగా అనుమానిస్తూ వెంటనే చెన్నైకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బాలుడు ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా లక్షణాలు కనిపిస్తూ ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు.
గ్రామంలో మెడికల్ క్యాంప్ : అయితే వ్యాధి లక్షణాలు పూర్తిగా నిర్ధరణ కాకముందే బాలుడికి వైరస్ సోకిందనే వార్త వైరల్ అవ్వడంతో రాష్ట్ర ప్రత్యేక వైద్య సిబ్బంది ఆ గ్రామంలో పర్యటించారు. అనంతరం బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా ఇంకా నిర్ధారణ కాలేదని వైద్య బృందం స్పష్టం చేసింది. గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకెవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని పరీక్షలు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో 'జికా వైరస్' - గ్రామంలో మెడికల్ క్యాంపు - మంత్రి ఆనం ఏమన్నారంటే!