High Court New Additional Judges Swearing-in Ceremony in:రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వారిచే ప్రమాణం చేయించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు అదనపు న్యాయమూర్తుల ప్రమాణంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది.
Justice Hariharanath Sharma:జస్టిస్ హరిహరనాథ శర్మ స్వస్థలం కర్నూలు జిల్లా. ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2017-18 మధ్య అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా 2020 - 22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా 2023లో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.