ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన చంద్రబాబు జన్మదిన వేడుకలు - వెల్లువెత్తిన శుభాకాంక్షలు - Birthday Wishes to Chandrababu - BIRTHDAY WISHES TO CHANDRABABU

Nara Chandrababu Naidu Birthday Wishes : అభివృద్ధి, సంక్షేమం కలగలిసిన రూపం నారా చంద్రబాబు నాయుడు అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు ఎక్కడికక్కడ వేడుకలు జరిపారు. ప్రధాని మోదీ వంటి ప్రముఖులూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Nara_Chandrababu_Naidu_Birthday_Wishes
Nara_Chandrababu_Naidu_Birthday_Wishes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:56 PM IST

Updated : Apr 20, 2024, 10:55 PM IST

Nara Chandrababu Naidu Birthday Wishes : రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎక్కడికక్కడ కేక్​లు కట్ చేసి తన అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలలో పాల్గొంటున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ఎక్స్​లో ఒకటవ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

16 వేల 676 అడుగుల ఎత్తులో - చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు

రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లులో వేద పండితులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు ఆశీర్వచనం అందించారు. చిన్నారులతో కలిసి చంద్రబాబు కేక్ కోశారు. అనంతరం చిన్నారులకు తినిపించి వారితో సరదాగా గడిపారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ విభాగం, బీసీ సెల్, పార్టీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. బీసీ నేతలు ట్రాక్టర్ ట్రాలీపై భారీ కేక్ తీసుకొచ్చి, కోసి పంచారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోచంద్రబాబు పుట్టినరోజు వేడుకలు : తిరువూరులో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌ కేక్ కట్ చేశారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భారీ కేకు కోసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. రాము దంపతులు సైకిల్ తొక్కుతూ శ్రేణులను ఉత్సాహ పరిచారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్య కేక్‌ కోసి చంద్రబాబు సేవలను కొనియాడారు.
బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేెశం అభ్యర్థి కొండయ్య ఆధ్వర్యంలో బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. గుంటూరులో కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో 74 కిలోల కేక్ కోశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. విశాఖలో ఎంపీ అభ్యర్థి భరత్, టీడీపీ నేత గండి బాబ్జీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.

భారీ కేకులతో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు :చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు కుప్పం మున్సిపాలిటీ పరిధి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో 74 కిలోల కేకును కత్తిరించి సంతోషాన్ని పంచుకున్నారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కేక్ కోసి పార్టీ నాయకులకు తినిపించారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని కొనియాడారు.

పెనుకొండలో ఎమ్మెల్యే అభ్యర్థి సవిత భర్త వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో కూటమి అభ్యర్థి థామస్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ కేకు కోసి శ్రేణులకు తినిపించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కేకు కోసి అభిమానులకు పంచి రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు మళ్లీముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు.

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ : ప్రకాశం జిల్లా ఒంగోలులో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కేక్ చేసి పంచారు. ఆపై వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరమని నాయకులు నొక్కిచెప్పారు. ఆదోనిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఎంతో దోహదపడుతూ వచ్చిందని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రబాబు పుట్టినరోజు వేళ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేసిన ఆయన ప్రజలకు మరింత సేవ చేసేందుకు భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన ఆయన. నిరంతం రాష్ట్రం గురించే ఆలోచన చేస్తారన్నారు. వైసీపీ పెట్టిన కేసులతో జైల్లో ఉన్నప్పుడూ ఆయన మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

పండుగలా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు- పాల్గొన్న భువనేశ్వరి, బాలకృష్ణ, బ్రాహ్మణి

ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. జమైకాలో వినూత్నంగా సెలబ్రేషన్స్ !

Last Updated : Apr 20, 2024, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details