Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: నిజం గెలవాలి యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. మృతుల కుటంబాలను ఓదార్చి వారికి తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం ఒకే కుటుంబ ధైర్యంగా ఉండండి అని బాధితులకు ఆమె ధైర్యాన్నిస్తున్నారు. అంతేకాకుండా నందిగామ మండలం కంచికర్లలో చంద్రశేఖరరావు కుటుంబాన్ని పరామర్శించారు.
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం కంచికర్లలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్‌రావు ఆనారోగ్యంతో మరణించారు. నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రలో భాగంగా చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. దేవినేని ఉమాను కలిసి, చంద్రశేఖరరావు చిత్రపటానికి ఆమె అంజలి ఘటించారు.
మహిళలంతా స్వయం శక్తితో ఎదగాలి: నారా భువనేశ్వరి
తెలుగుదేశం అన్ని వేళలా అండగా ఉంటుంది: చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మరణించిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. మల్లికార్జున నివాళులు అర్పించారు. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని మల్లికార్జున కుటుంబానికి అందించారు. తెలుగుదేశం అన్నివేళలా అండగా ఉంటుందని వారి కుటుంబానికి ధైర్యమిచ్చారు.
Nara Bhuvaneshwari Tourచంద్రబాబు అక్రమ అరెస్టుతో మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించినట్లు భువనేశ్వరి వివరించారు. ఇంకా పరామర్శించాల్సిన కుటుంబాలు సుమారు 160 వరకు ఉన్నాయని, వారందర్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడు ప్రజల బాగు గురించేనని భువనేశ్వరి స్పష్టం చేశారు.