ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ పోలీసులా మజాకా- సినిమాటిక్ స్టైల్లో పార్థీ గ్యాంగ్​ను పట్టేసుకున్నారుగా - Pardhi Gang Arrest in Hyderabad - PARDHI GANG ARREST IN HYDERABAD

Nalgonda CCS Police Arrested Two Thieves in Hyderabad: జాతీయ రహదారులే లక్ష్యంగా రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్​ను సినిమాటిక్ స్టైల్​లో పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ఈ గ్యాంగ్​పై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అందులో ఇద్దరిని అరెస్టు చేశారు.

Pardhi_Gang_Arrested_in_Hyderabad
Pardhi_Gang_Arrested_in_Hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 12:15 PM IST

Pardhi Gang Arrested in Hyderabad:హైదరాబాద్​లో రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నగర శివారులోని పెద్ద అంబర్​పేట రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:ఇటీవలే జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు తిరిగబడితే హత్యలు చేసిన ఘటనలు కూడా జరిగాయి. అప్రమత్తమైన నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకునే పనిలో పడ్డారు.

ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వారిని వెంబడించారు. రాచకొండ పరిధిలోకి దొంగలు పారిపోగానే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి దుండగులు కత్తులతో ఎదురుదాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కడంతో వారిని అరెస్టు చేసి నల్గొండ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఈ తాళం ఉంటే మీ ఇల్లు సేఫ్​! టచ్ చేస్తే మొబైల్​కు అలర్ట్స్​- దొంగల ఫొటోలు తీస్తుందట - Army Man Digital Lock

ముగ్గు వేస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ - సీసీటీవీలో దృశ్యాలు - Chain Snatching in Mangalagiri

ABOUT THE AUTHOR

...view details