ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లికి అనారోగ్యంతో పాటు మానసిక సమస్య - ఆమె కుమార్తె ఏం చేసిందంటే?

తల్లికి ఉరేసి - ఆపై తానూ ఉసురుతీసుకొన్న కుమార్తె

MOTHER_AND_DAUGHTER_SUICIDE
MOTHER_AND_DAUGHTER_SUICIDE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Mother And Daughter Suicide in Kakinada District :అమ్మను బాగా చూసుకోవాలని ఆ యువతి పెళ్లి కూడా చేసుకోలేదు. టైలరింగ్‌ చేస్తూ ఆ సంపాదనతోనే ఆమె తన తల్లిని పోషించుకునేది. తనకు అత్యంత ఇష్టమైన తల్లి అనారోగ్యంతో పాటు మానసిక సమస్యలతో బాధపడుతుండటంతో ఆమె తల్లడిల్లింది. దీంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. ముందుగా తల్లికి ఉరేసి ఆ తర్వాత తానూ అదే పనిచేసి మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఇది వెలుగు చూసింది.

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం వై.కొత్తపల్లికి చెందిన ఆకాశం సరస్వతి(60), ఆమె కుమార్తె స్వాతి(28) పన్నెండేళ్లుగా కాకినాడ పెంకెవారి వీధిలోని ఓ భవనం మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. ఆకాశం సరస్వతి భర్త నర్సింహా రావు పదహారేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వీరికి ఇద్దరూ కుమారైలు. పెద్ద కుమార్తె బుజ్జికి వివాహం అనంతరం విశాఖలో ఉన్నారు. చిన్న కుమార్తె స్వాతి ఇంట్లోనే టైలరింగ్‌ చేస్తుంది. సరస్వతి కొన్నాళ్లుగా అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతుంది. దీంతో స్వాతి ఆందోళనకు గురి అయ్యింది.

'మీరు లేని లోకంలో ఉండలేను - మీ వెంటే నేను'

ఈ క్రమంలోనే ఇంట్లోని ఫ్యాన్‌ హుక్‌కు చీరతో తల్లికి ఉరేసి ఆమె మరణించక మంచంపై మృతదేహాని నుంచి తానూ ఉరేసుకున్నట్లు పోలీస్​ అధికారులు నిర్ధారణకు వచ్చారు. 3 రోజులుగా పాలు పోసే వ్యక్తి సీసాను గుమ్మం వద్ద ఉంచుతున్నా తీసుకోకపోవడంతో ఇంటి ఓనర్​ అయిన గుర్రాల శ్రీనివాస్‌కు విషయం చెప్పాడు. తలుపులు తీయకపోవడం, ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. చనిపోయి మూడురోజులు కావడంతో మృతదేహాలు పాడైపోయి ఉన్నాయి. దీంతో పోలీసు అధికారులు పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు - అంతలోనే మలుపు తిరిగిన ప్రయాణం - కళ్లు చెమర్చే ఘటన

స్వగ్రామం విడిచి:సరస్వతి దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో కొంత కాలం కర్ణాటకలో ఉండి వచ్చారు. భర్త చనిపోయిన తరువాత సరస్వతి తన పిల్లలను తీసుకొని జీవనోపాధి కోసం కాకినాడ వచ్చారు. ఈ మధ్యనే మామిడికుదురులోని బంధువులకు స్వాతి ఫోన్‌ చేసి కుశల ప్రశ్నలు వేసినట్లు సమాచారం.

'మేమేం చేశాం అమ్మా' - ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి - Mother Commits Suicide

ABOUT THE AUTHOR

...view details