Hotels Association Meeting in Guntur:వైఎస్సార్సీపీ పాలనలో పర్యాటకం, ఆతిథ్య రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరులో జరిగిన ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి ఆయన హాజరయ్యయారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన హోటళ్ల యాజమానులు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. జగన్ హయాంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఆతిథ్య రంగాన్ని నాశనం చేశారని శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆతిథ్య రంగాన్ని నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
సూపర్ టేస్టీగా ఉండే "హోటల్ స్టైల్ పూరీ కర్రీ" - ఇలా చేస్తే నిమిషాల్లో సిద్ధం! - Poori Curry Recipe
పరిపాలన చేతకాని వ్యక్తి చేతిలోకి రాష్ట్రం వెళ్లిపోయినప్పుడు అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు అన్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలన్నారు. ఏ ప్రభుత్వం రాజధాన్ని అంశాన్ని మొదలుపెట్టినా పూర్తి చేయాల్సిన బాధ్యత తర్వాత అధికారంలోకి వచ్చినవారు తీసుకోవాలని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాగున్నప్పుడు అన్ని వ్యాపారులు సవ్యంగా సాగుతాయన్నారు. హోటళ్ల యాజమానులు ఆహార నాణ్యత విషయంలో రాజీపడ వద్దని ఎమ్మెల్యే శ్రీనివాసరావు సూచించారు. ఐదేళ్లలో పర్యాటకం, ఆతిథ్య రంగాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని వారి సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తానని హామీ ఇచ్చారు.