ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నమస్కారం పెట్టాలని చూస్తున్నా జగన్ అసెంబ్లీకి రావట్లేదు - కోటంరెడ్డి ఎద్దేవా - MLA KOTAMREDDY CHIT CHAT

రోజూ మాట్లాడేందుకు గంట సమయమిస్తే వస్తారేమో - ప్రతిపక్ష నేతగా మైక్ కోసమే గొడవ తప్ప ప్రజాసమస్యల కోసం

MLA Kotamreddy Sridhar Reddy Chit Chat
MLA Kotamreddy Sridhar Reddy Chit Chat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2024, 11:34 AM IST

MLA Kotamreddy Sridhar Reddy Chit Chat at Assembly Premises :వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్​మోహన్​ రెడ్డి తీరుపై నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన అసెంబ్లీకి వస్తే ఓ నమస్కారం పెట్టాలని చూస్తున్నట్లు విమర్శించారు. అయినా ఆయన రావడం లేదని వ్యంగాస్త్రాలు సంధించారు. రోజూ ఓ గంట సమయం జగన్‌కు మాట్లాడే అవకాశం కల్పిస్తామని లిఖితపూర్వకంగా రాసిస్తే శాసనసభకు వస్తారేమోనని ఎద్దేవాచేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో కోటంరెడ్డి చిట్​చాట్ నిర్వహించారు.

జగన్ ఏం మాట్లాడినా అడ్డు చెప్పమని హామీ ఇస్తే అసెంబ్లీకి వస్తారేమోనని కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో తాను మినహా ఎవరూ మాట్లాడటానికి వీల్లేదనే తత్వం ఆయనదని విమర్శించారు. 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగాజగన్ అసెంబ్లీలో ఎప్పుడు గొడవ పడినా మైక్ కోసమే తప్ప ప్రజాసమస్యలు కోసం కాదని గుర్తు చేశారు. వారి పార్టీ ఎమ్మెల్యేలతోనూ మైక్ కోసమే గొడవ చేయించేవారని కోటంరెడ్డి అన్నారు.

2017లో వైఎస్ జగన్​మోహన్​ రెడ్డి​ పాదయాత్రకు వెళ్లే సమయంలో అసెంబ్లీ బాధ్యత బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డికి గాని ఇంకెవరికైనా అప్పగించి వెళ్తే బాగుండేదని కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ జగన్ అలా చేయలేదంటే ఆయన మినహా మిగతావారెవరూ మాట్లాడటం ఇష్టం లేదని అర్ధమని శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు.

జగన్‌ అసెంబ్లీకి రారని పందేలు నడుస్తున్నాయి - 10మంది ఎమ్మెల్యేలూ సహకరించట్లేదు : అనిత

ABOUT THE AUTHOR

...view details