ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలిసారిగా మంత్రుల పర్యటన- ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు - ministers received a warm welcome - MINISTERS RECEIVED A WARM WELCOME

Ministers received a warm welcome: బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులకు.. ఘనస్వాగతం లభించింది. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి, అపూర్వ రీతిలో ఆహ్వానాలు పలికారు. భారీగా తరలివచ్చిన కూటమి కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తామని, మంత్రులు హామీ ఇచ్చారు.

ministers received a warm welcome:
ministers received a warm welcome: (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 16, 2024, 7:59 PM IST

Ministers received a warm welcome: బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులకు.. ఘనస్వాగతం లభించింది. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి అపూర్వ రీతిలో ఆహ్వానాలు పలికారు. భారీగా తరలివచ్చిన కూటమి కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ, బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

తొలిసారిగా జిల్లాలకు వచ్చిన మంత్రులు (ETV Bharat)

నెల్లూరులో తెలుగుదేశం నేతలు చేపట్టిన విజయోత్సవ ర్యాలీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, అక్కడి నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ గాంధీ బొమ్మకు పాలాభిషేకం చేశారు. ర్యాలీలో పురపాలక మంత్రి నారాయణతో పాటు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌, రామకృష్ణ, ఇతర నాయకలు పాల్గొన్నారు. శనివారం మంత్రి నారాయణ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. బాణసంచా కాల్చి కేకులు కట్‌ చేసి సందడి చేశారు. ఎన్టీఆర్‌ నగర్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం, నారాయణకు మంత్రి పదవి దక్కడంతో తిరుపతి జిల్లా నాయుడు పేట దర్గా సెంటర్‌లో కాపు సంఘం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
'వైఎస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్యశాఖకు అనారోగ్యం- పూర్తిగా ప్రక్షాళన చేస్తాం' - health minister Satya Kumar Yadav

రాష్ట్ర హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన వంగలపూడి అనితకు ఘన స్వాగతం లభించింది. మంత్రి అనిత ముందుగా అన్నవరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత పాయకరావుపేటలోని పాండురంగ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రిని మంత్రిని భారీ గజమాలతో సత్కరించిన తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు.

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి, తొలిసారి వైఎస్ఆర్ కడప జిల్లాకు వచ్చిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి కూటమి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కడప విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు మంత్రికి నీరాజనాలు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో పర్యటించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మెల్యేని భారీ గజమాలతో సత్కరించి... బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

"అదేంటి, ఇక్కడ ఎందుకు ఉంది?"- మనుషులు, వస్తువులనూ నమ్మని మాజీ సీఎం - Ex CM YS Jagan 5 Years Ruling

ABOUT THE AUTHOR

...view details