ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ పాలనలో ఇరిగేషన్​ నిర్వీర్యం- రేపు డెల్టాకు పట్టిసీమ నీటి విడుదల : నిమ్మల - Polavaram Project - POLAVARAM PROJECT

Minister Nimmala Ramanaidu on Polavaram Project: గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరిగేషన్​ను నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు, తాగు నీటిని బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Minister_Nimmala_Ramanaidu_on_Polavaram_Project
Minister_Nimmala_Ramanaidu_on_Polavaram_Project (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 7:53 PM IST

Minister Nimmala Ramanaidu on Polavaram Project:రాష్ట్రంలో గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ అరాచక పాలనలో ఇరిగేషన్​ నిర్వీర్యం అయిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్​ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా డెల్టాకు ఖరీఫ్​కు సాగు, తాగునీరు అందించాలనే దృక్పథంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని బుధవారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తాడిపూడికి సంబంధించి 890 క్యూసెక్కులు, పురుషోత్తం పట్నం 1,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఏటా మూడు వేల క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని, 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారని తెలిపారు. పోలవరానికి జగన్ ఓ శాపమని, ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రారంభించిన ఘనత చంద్రబాబుకే చెందుతుందని అన్నారు.

పోలవరం క్రస్ట్ గేట్లను తాకిన గోదారమ్మ- 43 వేల క్యూసెక్కుల నీటి విడుదల - water level at Polavaram project

పట్టిసీమ కాదు.. ఒట్టిసీమ అని అసెంబ్లీ సాక్షిగా జగన్ విమర్శించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అదే కృష్ణా డెల్టా రాయలసీమకు సాగు, తాగునీటికి ఆధారంగా మారిందని అన్నారు. ప్రస్తుతం 30 లక్షల ఎకరాలకు తాగు, సాగు నీటిని కృష్ణా డెల్టాకు అందిస్తున్నాం అని చెప్పారు. రాష్ట్రంలో ఇతర రిజర్వాయర్లు నిండితేనే ఆగస్టులో సాగు నీరు వస్తుంది.. అలాంటి పరిస్థితిని పట్టిసీమ ద్వారా మార్చాం అని అన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 30-35 టీఎంసీల నీరు రిజర్వ్ చేస్తారని, అయితే ప్రస్తుతం హాఫ్ టీఎంసీ మాత్రమే రిజర్వాయర్​లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఇది పూర్తిగా జగన్ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన సలహాలు, సూచనలు నివేదిక రూపంలో కేంద్రానికి అందిస్తారని నిమ్మల తెలిపారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టులోని స్పిల్ వే ఫిష్ లాడర్, అప్పర్ కాపర్ డ్యాం తదితర ప్రాంతాలను నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం అధికారులతో, అంతర్జాతీయ నిపుణులు బృందంతో ఆయన భేటీ అయ్యారు.

ఆ ఆలోచన సరికాదు - నీళ్లలో ఉన్నా ఏం కాదు - Polavaram Diaphragm Wall condition

ABOUT THE AUTHOR

...view details