ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో 60 లక్షల మందితో ప్రకృతి సాగు మా లక్ష్యం: అచ్చెన్నాయుడు - Achchennaidu congratulated AP CNF - ACHCHENNAIDU CONGRATULATED AP CNF

Minister Achchennaidu congratulated AP CNF Representatives: గుల్బెంకియన్ అవార్డు దక్కించుకున్న ఏపీ సీఎన్​ఎఫ్​ ప్రతినిధులకు మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు రావటం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అవార్డు డబ్బును ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని తెలిపారు.

achchennaidu_congratulated_apcnf
achchennaidu_congratulated_apcnf (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 9:13 PM IST

Minister Achchennaidu congratulated AP CNF Representatives: రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించటం లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పోర్చుగల్​కు చెందిన ప్రఖ్యాత 'గుల్బెంకియన్ అవార్డు ఫర్ హ్యూమానిటీస్' ​ను దక్కించుకున్న ఏపీ సీఎన్ఎఫ్ ప్రతినిధులకు, రైతులకు ఆయన అభినందనలు తెలియచేశారు. పర్యావరణాన్ని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని దాని ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు రావటం సంతోషదాయకమని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 లక్షల మంది రైతుల ప్రతినిధిగా నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకోవటం మహిళా సాధికారితకు నిదర్శనమని అచ్చెన్న అన్నారు. ఈ అవార్డు కింద ప్రకటించిన నిధిని అంతర్జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. పర్యావరణంతో పాటు పౌష్టికాహారం అందేలా రైతు సాధికార సంస్థ సారధ్యంలోని ఏపీసీఎన్ఎఫ్ కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు వ్యవసాయశాఖతో కలిసి ఈ దిశగా భాగస్వామ్యం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

మీరు తాగుతున్న నీరు సురక్షితమేనా? ఆర్వోప్లాంట్లలో తాగునీటి విక్రయాల్లో అక్రమాలు - Drinking Water in RO Plants

రాష్ట్రంలో 60 లక్షల మందితో ప్రకృతి సాగు మా ప్రభుత్వ లక్ష్యం. గుల్బెంకియన్ అవార్డు దక్కించుకున్న సీఎన్ఎఫ్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పర్యావరణం, రైతుల సంక్షేమం దృష్ట్యా గతంలో దీన్ని మా ప్రభుత్వం ప్రోత్సహించింది. అవార్డు డబ్బును ప్రకృతి వ్యవసాయ విస్తరణకు వినియోగిస్తామని హామీ ఇస్తున్నా. ప్రజలకు పౌష్టికాహారం అందేలా ఏపీ సీఎన్ఎఫ్ కృషి చేస్తోంది. వివిధ సంస్థలతో కలిసి సేవలందించాలని ఏపీసీఎన్‌ఎఫ్‌ను కోరుతున్నా. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు వ్యవసాయశాఖతో కలిసి భాగస్వామ్యం అందించాలి.- అచ్చెన్నాయుడు, మంత్రి

APCNF Won Gulbenkian Prize:కాగా ఆంధ్రపదేశ్ సమాఖ్య ప్రకృతి వ్యవసాయానికి ప్రఖ్యాత గుల్బెంకియన్ అవార్డు లభించిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థతో కలిపి ఏపీసీఎన్‌ఎఫ్‌ ఈ అవార్డు గెలుచుకుంది. గుల్బెంకియన్ అవార్డు కింద 1 మిలియన్ యురోల నగదు పురస్కారం లభించనుంది. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నుంచి రైతు సాధికార సంస్థకు చెందిన ఏపీసీఎన్ఎఫ్ అవార్డు అందుకున్నారు.

పులస అ'ధర'హో - రూ.24 వేలకు అమ్మిన గంగపుత్రుడు - pulasa fish sold for rs 24 thousand

'రాజ్‌ లేని లైఫ్​​ నాకొద్దు - ఆత్మహత్య చేసుకుంటున్నా'- తన అడ్వొకేట్​కు లావణ్య సందేశం - Raj Tarun Case Updates

ABOUT THE AUTHOR

...view details