Mango Crop Yields Fallen significantly in Nunna Mango Market :ఏటా ఈ సమయానికి మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చే వాహనాలతో కిక్కిరిసి ఉండాల్సిన ఎన్టీఆర్ జిల్లా నున్న మార్కెట్ చాలా స్తబ్ధుగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ నున్న మార్కెట్‌లో మాత్రం ఏప్రిల్ నెల రెండు, మూడు వారాల నుంచే సరకు ఎగుమతులు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు, రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్‌కత్తాకు ఎగుమతి చేస్తున్నారు. నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్‌కు మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి చాలా తక్కువ సరకు వస్తోంది. రోజుకు 400 నుంచి 500 టన్నుల వరకు ఎగుమతులు జరిగే మార్కెట్‌లో ఇప్పుడు కనీసం సగానికి సగం కూడా మామిడి వ్యాపారం సాగడం లేదు. రోజుకు 200 టన్నుల మామిడిని మాత్రమే ఎగుమతి చేస్తున్నారు.
'ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పూత ఆలస్యమైంది. జనవరిలో కొంత పూత వచ్చినా వైరస్ బారిన పడడంతో పిందె కట్టకుండానే రాలిపోయింది. గతంలో ఎకరానికి నాలుగు టన్నుల నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి రాగా ప్రస్తుతం సగానికిపైగా దిగుబడి తగ్గిపోయింది. అయితే ఈ ఏడాది ధరలు ఒకింత ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఊరట చెందుతున్నారు. బంగినపల్లి, రసాలు, తోతాపురి వంటి రకాలకు మంచి ధర పలుకుతోంది.' -మామిడి రైతులు
Mango Farmers: ప్రభుత్వ విధానాల శరాఘాతం.. సంక్షోభంలో మామిడి రైతు