Liquor Supply Stopped in Telangana:తెలంగాణ వ్యాప్తంగా అన్ని మద్యం డిపోలలో సరఫరా నిలిచిపోయింది. వైన్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రూపొందించిన సాప్ట్‌వేర్‌లో టెక్నికల్ సమస్యలే ఇందుకు కారణం. దీంతో సర్వర్ స్తంభించి తెలంగాణ మొత్తం మద్యం సరఫరాకి బ్రేకులు పడ్డాయి. దీంతో డిపోలకు వెళ్లిన డీలర్లు సర్వర్ సమస్యతో మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలో కొంతకాలంగా మద్యం సరఫరా పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారానే జరుగుతోంది. తద్వారా డీలర్లకు వేగంగా లిక్కర్ సరఫరా చేయడంతో పాటు డిపోల వద్ద ఎంత సరుకు ఉంది, డీలర్లు ఎంత తీసుకెళ్లారో స్పష్టంగా తెలిసేలా ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పద్ధతి అటు అధికారులకు, ఇటు డీలర్లకు ఉపయోగకరంగానే ఉంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.