ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి జూపార్క్​లో విషాదం - వ్యక్తిని చంపిన సింహం - tirupati zoo park

Lion Attack Man Dead in Tirupati Zoo Park: తిరుపతి జూ పార్కులో విషాదం చోటు చేసుకుంది. సరదాగా పార్క్​కు వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.

Lion_Attack_Man_Dead_in_Tirupati_Zoo_Park
Lion_Attack_Man_Dead_in_Tirupati_Zoo_Park

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 4:21 PM IST

Updated : Feb 15, 2024, 7:07 PM IST

Lion Attack Man Dead in Tirupati Zoo Park: తిరుపతి ఎస్వీ జూపార్క్​లో విషాదం చోటు చేసుకుంది. రాజస్థాన్​కు చెందిన సందర్శకుడు సింహం బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రాజస్థాన్‍కు చెందిన ప్రహ్లద్‍ గుర్జర్​ అనే వ్యక్తి లయన్‍ ఎన్‍ క్లోజర్‍ వద్దకు చేరుకున్నాడు. ఎన్‍ క్లోజర్‍ వద్ద ఉన్న సిబ్బంది వారిస్తున్నా గోడ పైన ఏర్పాటు చేసిన కంచెను దాటి లయన్‍ ఎన్‍ క్లోజర్‍ లోకి దూకాడు. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఎన్​క్లోజర్​లోకి దూకిన గుర్జర్​ను కాపాడేందుకు ప్రయత్నించారు.

ఎన్​క్లోజర్​లో ఉన్న మగ సింహం దాడి చేయడంతో సంఘటనా స్ధలంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి దగ్గర లభించిన ఆధారాల మేరకు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Feb 15, 2024, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details